38.2 C
Hyderabad
May 2, 2024 20: 57 PM
Slider జాతీయం

అప్పీలుకు వెళ్తున్నాను అప్పుడే శిక్ష ప్రకటించవద్దు

#PrashantBhushion

కోర్టు ధిక్కరణ నేరంపై ప్రకటించాల్సి ఉన్న శిక్షను అప్పుడే వెల్లడించవద్దని, తనకు అప్పీలు చేసుకునే సమయం ఇవ్వాలని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషన్ సుప్రీంకోర్టును కోరారు. కోర్టు ధిక్కరణ నేరపై ఇప్పటికే ఆయనపై తీర్పు వెలువడింది. అయితే శిక్ష వేసే విషయాన్ని గురువారానికి( రేపటికి) సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

అయితే తనకు శిక్షను అప్పుడే ప్రకటించవద్దని తనకు చట్ట ప్రకారం అప్పీలు చేసుకునే గడువు ఉందని ఆయన అంటున్నారు. న్యాయ వ్యవస్థ ను కించ పరుస్తూ జూన్ 27వ తేదీన ప్రశాంత్ భూషన్ ట్విట్ చేశారు. ఆ తర్వాత జులై 27న భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్ ఏ బాబ్డే కు వ్యతిరేకంగా మరొక వ్యాఖ్య చేశారు.

వీటిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ప్రశాంత్ భూషన్ ను ఈ నెల 14న నేరస్తుడిగా పేర్కొంది. శిక్షను విధించేందుకు 20వ తేదీ వరకూ గడువు తీసుకున్నది. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం తనకు అప్పీలు చేసుకోవడానికి 30 రోజులు గడువు ఉంటుందని ఆ లోపు శిక్షను ఖరారు చేయవద్దని ప్రశాంత్ భూషన్ అంటున్నారు.  

Related posts

మున్సిపల్ సమావేశం తక్షణమే నిర్వహించాలి

Satyam NEWS

ఆకాశ హర్మ్యం బుర్జు ఖలీఫా కట్టిన కంపెనీ దివాలా

Satyam NEWS

కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం

Satyam NEWS

Leave a Comment