28.7 C
Hyderabad
April 27, 2024 06: 53 AM
Slider ముఖ్యంశాలు

ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా కోవిడ్‌ నిబంధనలతో నిర్వహించాలి

#udaikumarias

ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షల నిర్వహణ పై హైదరాబాదు నుండి జిల్లాల కలెక్టర్లు అధికారులతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ తదితరులు పాల్గొన్నారు. అన్ని  జిల్లాల్లో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం పరీక్షలు పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని జిల్లాల కలెక్టర్లకు సంబంధిత అధికారులకు ఆమె ఆదేశించారు. కోవిడ్‌ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

ఎలాంటి లోటుపాట్లు లేకుండా పరీక్షలు సజావుగా జరిగేలా విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు సరైన సమయంలో హాజరయ్యేలా ఉదయం 8 గంటల బస్సులు అందుబాటులో ఉండేలా కలెక్టర్లు, ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

నాగర్ కర్నూల్ నుండి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్‌ పి. ఉదయ్ కుమార్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం పరీక్షలు ఈ నెల 25 నుంచి నవంబర్ 3 వరకు  జరుగుతాయన్నారు. ఉదయం 9:00 గంటల నుంచి 12:00  గంటల వరకు జరగనున్న పరీక్షలను సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్ల కావలసిన అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాలో 32 కేంద్రాల్లో  పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఎక్కడ ఎటువంటి పొరపాటు జరగకుండా, పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ తోపాటు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులకు ఆదేశించామన్నారు. ప్రస్తుతం కోవిడ్‌ ఉన్నందున కట్టుదిట్ట చర్యలు తీసుకుంటామని తెలిపారు.

విద్యార్థులు సకాలంలో చేరుటకు ఆర్టీసీ బస్సులను నడపాలని అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆర్‌టిసి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. పరీక్షలు నిర్వహించే సమయంలో విద్యుత్‌ అంతరాయం లేకుండా ఏర్పాటు చేయమని అధికారులకు ఆదేశాలు ఇచ్చామనన్నారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాటు చేశామని ప్రతి పరీక్ష కేంద్రం లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని వివరించారు.

ఇంటర్మీడియట్‌ పరీక్షల నేపథ్యంలో ఖచ్చితంగా కోవిడ్‌ జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యార్థులంతా భౌతిక దూరం పాటించేలా, థర్మల్‌ స్కానింగ్‌ చేయాలని, పరీక్షహాల్లో శానిటైజేషన్‌ ఏర్పాటు చేస్తున్నామనన్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామని జిల్లాలో ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్‌ పి ఉదయ్ కుమార్ మంత్రికి వివరించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి వెంకటరమణ డీఈవో గోవిందరాజులు జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి సాయినాథ్ రెడ్డి, డిఎస్పి మోహన్ రెడ్డి, ఆర్టీసీ సిఐ స్వామి, పరీక్షల నిర్వహణ జిల్లా కమిటీ సభ్యులు బి నరసింహులు, విద్యుత్ శాఖ డిఈ చంద్రశేఖర్ తదితరులు నాగర్ కర్నూల్ నుండి పాల్గొన్నారు.

Related posts

క్రీడలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం

Bhavani

మంచి మాట చెప్పి బాట చూపిన మహనీయులు

Satyam NEWS

ఇక్కడే తెలుగు బోధించకపోతే మరెక్కడ చెబుతారు?

Satyam NEWS

Leave a Comment