రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రంగారెడ్డి జిల్లాలో రామకృష్ణమిషన్ నూతన అంతర్జాతీయ కేంద్ర కార్యాలయం కన్హ శాంతి వనం ను నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆందోళనలు, అనిశ్చితి, అభద్రత, శత్రుత్వాలతో నిండిన ప్రపంచంలో శ్రీరామచంద్రమిషన్ వంటి సంస్థల బాధ్యత ఎన్నోరెట్లు పెరిగిందని అన్నారు. ఇలాంటి సంస్థలు ఉపశమనానికి తగిన భరోసా ఇవ్వగలవని ఆయన అన్నారు.
మానవాళి దిశను మార్చడానికి మనం మెరుగైన ప్రపంచం నిర్మించే దిశగా ఎంతో ఎక్కువ మంది యువతను మళ్లించి, వారిని ఈ కృషిలో భాగస్వాములను చేయాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. శ్రీరామచంద్ర మిషన్ కు చెందిన అంతర్జాతీయ సమాజం ఈ భూమండలాన్ని మెరుగైన ప్రాంతంగా తీర్చిదిద్దగలదన్న ఆకాంక్షను రాష్ట్రపతి వ్యక్తం చేశారు. అలాగే, మెరుగైన సమాజంగా, సంతోషం, సంపూర్ణ సానుకూల శక్తియుక్తులతో అలరారే దిశగా మానవాళిని పరివర్తన చెందించగలదన్న ఆకాంక్షను రాష్ట్రపతి వ్యక్తం చేశారు.