18.7 C
Hyderabad
January 23, 2025 02: 41 AM
Slider తెలంగాణ

ఏరియల్ వ్యూ: మేడారం జాతరకు గాలిమోటరు ప్రయాణం

minister srinivasgowd

తెలంగాణ కుంభమేళ శ్రీ సమ్మక్క – సారలమ్మల మహాజాతర సందర్భంగా  తెలంగాణ పర్యాటక శాఖ అధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్ బేగం పేట విమానాశ్రయం నుండి మేడారం కు హెలికాప్టర్ సేవలను రాష్ట్ర అబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి  వి. శ్రీనివాస్ గౌడ్  ప్రారంబించారు. ఈ టూరిజం ప్యాకేజీ లో భాగంగా బేగంపేట ఎయిర్ పోర్టు నుండి మేడారం, మేడారం నుండి హైదరాబాద్ లోని బేగం పేట ఎయిర్ పోర్టు వరకు  నిర్వహిస్తున్నామన్నారు.

హైదరాబాద్ నుండి 6 గురు ప్రయాణికులకు 1లక్ష 80 వేలు తో పాటు జి యస్ టి (1.80.000 + జి యస్ టి) ఉంటుందన్నారు. వీటితో పాటు మేడారం జాతర వ్యూ హెలిక్యాప్టర్ నుండి చూసేందుకు ప్రతి ప్రయాణికుడికి 2999.00 నామ మాత్రపు చార్జీ తో అవకాశం కల్పిస్తారు. పర్యాటకులు హెలిక్యాప్టర్ సదుపాయం ను ఉపయోగించుకోవటానికి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 94003 99999. ఈ కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, టూరిజం చైర్మన్ భూపతి రెడ్డి, రాష్ట్ర పౌర విమానయాన  శాఖ డైరెక్టర్ భరత్ రెడ్డి, టూరిజం MD  మనోహర్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Related posts

ప్రభుత్వం ప్రజల్లో నమ్మకం కోల్పోయే సోషల్ మీడియా పై ఆశలు

mamatha

నాజా జిల్లా అధ్యక్షుడు మందడి చిరంజీవిని సన్మానించిన పెబ్బేరు విలేఖరులు

Satyam NEWS

త్వరలో బఫర్ జోన్ లో మినీ ఫంక్షన్ హాల్ ఏర్పాటు

mamatha

Leave a Comment