వివాదాలు ముసురుకున్న నేపథ్యంలో ఎస్ వి బి సి చైర్మన్ పోస్ట్ కు పృథ్వి రాజీనామా చేస్తున్నారు. మరి కాసేపట్లో ఆయన బహిరంగంగా ఈ రాజీనామా లేఖను సమర్పించనున్నారు. ఒక ఉద్యోగస్థురాలితో ఫోన్ లో రాసలీలలు జరిపిన పృథ్వి పై ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆయన రాజీనామాకు నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
అమరావతి మహిళలపై అనుచితంగా వ్యాఖ్యలు చేసిన పృథ్విని సాటి సినీ నటుడు, వైసిపి నాయకుడు పోసాని తీవ్రంగా విమర్శించిన విషయం తెలిసిందే. అమరావతి మహిళా రైతులను కమ్మ కులం పేరుతో పృథ్వి అవమానించారు. ఆ తర్వాత ఉద్యోగస్థురాలితో రాసలీల ఫోన్ సంభాషణ వెలుగులోకి వచ్చింది. పృథ్వి బహిరంగ క్షమాపణలు చెప్పినా పదవి మాత్రం ఉండలేదు.