32.7 C
Hyderabad
April 27, 2024 02: 49 AM
Slider జాతీయం ప్రత్యేకం

బలవంతపు హిందీపై మోడీ వివరణ

modi usa 1

హౌడీ మోడీ వేదికను ఉపయోగించుకుని ప్రధాని నరేంద్రమోడీ హిందీ భాష పై ఇటీవల తలెత్తిన వివాదానికి చాకచక్యంగా ఫుల్ స్టాప్ పెట్టారు. హిందీ భాషా దినోత్సవం సందర్భంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఒకే దేశం ఒకే భాష థియరీని పైకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అమిత్ షా చేసిన ఈ ప్రతిపాదనతో దక్షిణాది రాష్ట్రాలు ఒక్క సారిగా భగ్గుమన్నాయి. ఉత్తర భారత దేశంలోని నాన్ హిందీ రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాల నుంచి కూడా అనూహ్య వ్యతిరేక భావనలు వ్యక్తం అయ్యాయి. అమిత్ షా ఉత్తరాది రాష్ట్రాల ఎజెండాను దక్షిణాది రాష్ట్రాలపై రుద్దుతున్నారని విమర్శలు వెల్లువెత్తాయి. రాజ్యాంగ ఆదేశిక సూత్రాలకు విరుద్ధంగా అమిత్ షా మాట్లాడుతున్నాడని ఒక్క సారిగా ప్రతిపక్షాలు కూడా విరుచుకుపడ్డాయి. హిందీ భాష మాట్లాడితే తప్ప ఈ దేశంలో ఉండే అర్హత లేదా అని సామాజిక మాధ్యమాలలో పోస్టులు లెక్కకు మించి సర్క్యులేట్ అయ్యాయి. దాంతో అధికార బిజెపి ఉక్కిరిబిక్కిరి అయింది. అయితే దీనికి వ్యతిరేకంగా మాట్లాడే సాహసాన్ని దక్షిణాది బిజెపి నేతలు ఎవరూ చేయలేకపోయారు. అమిత్ షా చెప్పిన దాన్ని ఖండించే స్తోమతు ఈ దేశంలో ఎవరికి లేదని మరొక్క మారు నిరూపించారు. అయితే ఈ వివాదానికి ప్రధాని నరేంద్రమోడీ ఫుల్ స్టాప్ పెట్టే దిశగా అమెరికాలోని హ్యూస్టన్ లో జరిగిన హౌడీ మోడీ కార్యక్రమాన్నిఎంచుకున్నట్లగా కనిపించింది. విభిన్న భాషలు మాట్లాడటం, విభిన్న సంస్కృతులు కలిగి ఉండటమే భారత దేశ విశిష్టత అని ఆయన స్పష్టంగా చెప్పారు. హిందీతో బాటు బెంగాలీ, తెలుగు భాషల ఔన్నత్యాన్ని ఆయన అంతర్జాతీయ వేదికపై చాటి చెప్పి హిందీ తో బాటు బెంగాలీ, తెలుగు వైశిష్ట్యాన్ని ఆయన విశదీకరించి చెప్పారు. దీంతో బహు భాషా వేదికగానే భారత్ ఉంటుందని, ఉండబోతున్నదని ఆయన తేల్చి చెప్పినట్లు అయింది.

Related posts

భారత దేశంలో తెలుగు వారిని గుర్తించేలా చేసింది ఎన్టీఆర్

Bhavani

భారత నిఘా క్వాడ్ కాప్టర్ ను కూల్చిన పాకిస్తాన్

Satyam NEWS

కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్‌పై సీబీఐటీలో కార్యక్రమం

Satyam NEWS

Leave a Comment