42.2 C
Hyderabad
April 26, 2024 15: 03 PM
Slider తెలంగాణ

జర్నలిస్టుల సంక్షేమమే జెఎస్ఎస్ ధ్యేయం

journalists asso

జర్నలిస్టుల సంక్షేమమే తమ సంఘం అంతిమ ధ్యేయమని తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అనంచిన్ని వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి గౌటి రామకృష్ణ పేర్కొన్నారు. శనివారం కోదాడ పట్టణంలోని ఎంఎస్ కాలేజీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన జెఎస్ఎస్ సూర్యాపేట జిల్లా  జర్నలిస్టుల సమావేశంలో ఆనం చిన్ని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలు, వారి కుటుంబ  సంక్షేమమే లక్ష్యంగా ఈ జెఎస్ఎస్  ఏర్పాటు చేయబడిందని అన్నారు. జర్నలిస్టుగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి ఎలాంటి తారతమ్యం లేకుండా అక్రిడేషన్లు వెంటనే మంజూరు చేయాలని, ఇది ప్రతి జర్నలిస్ట్ ప్రాథమిక హక్కు అని అన్నారు. గతంలో చేసిన జర్నలిస్టులతో సహా ప్రతి ఒక్కరికి కనీసం 300 గజాల స్థలం, త్రిబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రభుత్వం ఇవ్వాలన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించుకోలేక లేకపోయాయని, చిన్నా, పెద్దా పత్రిక అని తేడా లేకుండా జర్నలిస్టులు అందరూ ఏకమై సమస్యల కొరకు కలిసికట్టుగా పోరాడాలన్నారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రభుత్వాలు నూతన చట్టాలను రూపొందించాలని, జర్నలిస్టుగా ఉన్నప్పటి నుంచి ఆయా మీడియ యమాన్యాలు కనీస వేతనం కల్పించాలని, జర్నలిస్టులపై తప్పుడు కేసులు పెట్టే వారిపై వెంటనే సస్పెన్షన్ వేటు, ఒత్తిడి తెచ్చే నాయకులపై రాజకీయపార్టీల నుంచి శాశ్వత బహిష్కరణ విధించాలని అన్నారు. ఇప్పటికే జర్నలిస్టులపై పెట్టిన కేసులన్నింటిపై పునర్విచారణ బహిరంగంగా జరపాలని అన్నారు. జర్నలిస్టులందరికీ జాతీయ రాష్ట్ర రహదారులు ఓఆర్ఆర్ టోల్ ప్లాజా నుండి మినహాయింపు కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జెఎస్ఎస్ రూపొందించిన డిమాండ్లను అమలయ్యే విధంగా ప్రతి ఒక్క జర్నలిస్టులు కృషి చేయాలని తెలిపారు. ఈకార్యక్రమంలో కోశాధికారి మండ రాజేష్, ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్రీధర్ యాలాల, సహాయ కార్యదర్శి నరసింహరావు, అధికార ప్రతినిధి అయితగాని జనార్దన్, నకిరికంటి నాగేంద్రబాబు, కరుణాకర్, ఆనంతుల మధు, ఈదయ్య, సుధీర్, సైదులు,ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు

Related posts

టిడ్కో ఇళ్ల పై జగన్ రెడ్డి ప్రభుత్వం మీనమేషాలు

Satyam NEWS

వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి రెండో నోటీసు

Bhavani

బెంగాల్ మంత్రి సుబ్రతా ముఖర్జీ అనారోగ్యంతో కన్నుమూత

Sub Editor

Leave a Comment