30.7 C
Hyderabad
April 29, 2024 03: 05 AM
Slider నల్గొండ

ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ తక్షణమే నిలిపివేయాలి

#roshapathi

ఈనెల ఎనిమిదో తేదీ నుండి 30వ,తేదీ  వరకు సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లేబర్ కోడ్ ల రద్దు,కనీస వేతనం 24000 కోసం జరిగే పాదయాత్రను విజయవంతం చేయాలని సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శీతల రోశపతి డిమాండ్ చేశారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని సి ఐ టి యు టౌన్ కమిటీ సమావేశంలో రోషపతి మాట్లాడుతూ ఈనెల ఎనిమిదో తేదీ భారతదేశంలో మొదటిసారిగా సిపాయిలు తిరుగుబాటు చేసింది 8 సెప్టెంబర్ 1857 అని,నాడు జరిగిన తిరుగుబాటు భారతదేశ స్వాతంత్య్రం కోసం అని,నేడు జరిగే పోరాటం రైతు కార్మిక చట్టాల రద్దు కోసం అని అన్నారు.కేంద్ర,రాష్ట్ర వ్యాప్తంగా ఈ తిరుగుబాటుకి ప్రభుత్వం తక్షణమే దిగివచ్చి చట్టాలను రద్దు చేయాలని, కేంద్రంలోని ప్రభుత్వ సంస్థలను, ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని,కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి రాష్ట్రప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటానికి ఈ పాదయాత్రకు సంఘీభావం తెలియ చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యవర్గ సభ్యులు యల్క సోమయ్య గౌడ్,ఉపతల గోవిందు,శీతల చందు, గుండెబోయిన వెంకన్న,గుగ్గిళ్ళ సైదులు, లింగయ్య,కోటమ్మ,ఉమ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

తన తండ్రి పుట్టిన నగరంలో కొడుకు కు జ్ఞాన సరస్వతి అవార్డు…

Satyam NEWS

తిరుపతి లో కరోనా నియంత్రణకు ఏకైక మార్గాలు రెండు

Satyam NEWS

పేదరికం నిర్మూలనే టీడీపీ ధ్యేయం

Satyam NEWS

Leave a Comment