28.7 C
Hyderabad
April 27, 2024 06: 22 AM
Slider జాతీయం

ముంబయి ఐఐటికి ఇంటిని విరాళంగా ఇచ్చిన వృద్ధురాలు

#IIT Bombay

ఒక వృద్ధురాలు తాను నివశిస్తున్న ఇంటిని ముంబయి ఐఐటికి విరాళంగా ఇచ్చారు. ముంబయి ఐఐటిలో పని చేసి కీర్తిశేషుడైన తన భర్త సుబిర్ కర్ కోరిక మేరకు తాను ఈ విరాళం ఇస్తున్నట్లు 82 ఏళ్ల నైనా కర్ తెలిపారు. ఐఐటి ముంబయికి ఇప్పటి వరకూ ఎవరూ ఇలాంటి విరాళం ఇవ్వలేదు.

సుబిర్ కర్ ముంబయి ఐఐటిలో చదువుకుని అక్కడే ఉద్యోగంలో చేరారు. 1962లో ఉద్యోగంలో చేరిన ఆయన 1963లో నైనా ను వివాహం చేసుకున్నారు.

మూడు దశాబ్దాల పాటు కాంపస్ లోని క్వార్టర్స్ లోనే వారు కాపురం ఉన్నారు. ఆ తర్వాత వారు పొవై లో సింగిల్ బెడ్ రూం అపార్ట్ మెంట్ కొనుక్కున్నారు. సుబిర్ కర్ ద్రవ పదార్ధాల తత్వశాస్త్రంలో పరిశోధనలు జరిపారు.

ఆయన ముంబయి ఐఐటిలో బయో మెడికల్ ఇంజనీరింగ్ ప్రోగ్రాం ను ప్రారంభించడంలో కీలక పాత్ర పోషించారు. మరణానంతరం తన యావదాస్తిని ఐఐటి ముంబయి కి ఇవ్వాలని ఆయన వీలునామా రాశారు.

1990లో ఆయనకు తొలి పారి హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు వీలునామా కూడా రాశారు. ఆ తర్వాత ఆయన 2001 లో మరణించారు. ఆయన రాసిన వీలునామా ప్రకారం తాను ఈ ఇంటిని ఐఐటి ముంబయికి విరాళంగా ఇస్తున్నట్లు నైనా తెలిపారు.

ఈ ఇల్లు ఎంత ఖరీదు చేస్తుందనే విషయం చెప్పేందుకు ఆమె నిరాకరించారు. వీరిద్దరికి సంతానం లేదు.

Related posts

తిరుపతి ప్రజలకు తెలుగుదేశం పార్టీ శ్రేణుల అండ

Satyam NEWS

ప్ర‌తి ఆదివారం ప్రాప‌ర్టి ట్యాక్స్ ప‌రిష్కారం డే

Satyam NEWS

దామోదర సంజీవయ్య కు ఘన నివాళి

Bhavani

Leave a Comment