40.2 C
Hyderabad
April 29, 2024 15: 40 PM
Slider గుంటూరు

నో రెలీజియన్: భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి

nrt gandhi

లౌకిక రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ప్రజలందరూ ముందుకు రావాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ముజఫర్ అహమ్మద్ పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ 72 వ వర్ధంతి సందర్భంగా నరసరావుపేట మునిసిపల్ కార్యాలయం వద్దనున్న గాంధీ విగ్రహ ప్రాంతంలో నేడు మానవహారం ఏర్పాటు చేశారు.

లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సత్యాగ్రహ దీక్ష లో ముజఫర్ మాట్లాడుతూ మత ప్రాతిపదికన భారతదేశాన్ని విడగొట్టడానికి మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా ఎన్.ఆర్. సి, సి.ఎ.ఎ, ఎన్. పి.ఆర్, చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. విజ్ఞాత గలిగిన భారత దేశ పౌరులందరు వ్యతిరేకించి మతసామరస్యాన్ని కాపాడాలన్నారు.

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 2019 అధికారంలోకి వచ్చాక కార్మిక, కర్షక, విద్యార్థి, ప్రజానీకాన్ని,ప్రభుత్వ రంగాన్ని నాశనం చేసే విధానాలను వడివడిగా అడుగులు వేస్తున్నారన్నారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతి ఒక్కరూ ఖండించాలని ఆయన కోరారు. నరసరావుపేట బార్ అసోసియేషన్ అధ్యక్షులు  బి.సలీమ్ మాట్లాడుతూ రాజకీయాలకు, కులమతాలకు,ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కేంద్రం పై పొరాడాలన్నారు.

ఈ సత్యాగ్రహ దీక్షలో  న్యాయవాది విజయ కుమార్ , కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కామినేని రామారావు, శ్రామిక మహిళ సంఘం జిల్లా కన్వీనర్ డి. శివకుమారి, గాంధీ స్మారక సమితి నాయకులు ఈదర గోపిచంద్, పిడీఎం నాయకులు రామకృష్ణ, రైతు సంఘం నాయకులు అంజినియోలు, సీఐటీయూ నరసరావుపేట మండల అధ్యక్షులు పులుగుజ్జు రాజు, సీఐటీయూ నరసరావుపేట మండల కార్యదర్శి సిలార్ మసూద్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బత్తుల బాల కోటయ్య పాల్గొన్నారు.

ఇంకా ముస్లిం జేఏసీ నాయకులు ఎస్ క్.జిలనిమాలిక్, మునాఫ్ ,బాబు , అద్రుఫ్, గఫర్ బేగ్, మస్తాన్ వలి, ఇమామ్, కరిముల్లా, ఖాదర్, రఫీ మౌలా, ఆజిమ్,ఖాదర్ బాషా, సుబాని,అంగన్ వాడి వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మేటిల్డా,అంగన్ వాడి వర్కర్స్&హెల్పర్స్ నరసరావుపేట కార్యదర్శి నిర్మల, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Related posts

కంపెనీలను వెళ్లగొట్టినవారు ఇప్పుడు రమ్మంటున్నారు

Satyam NEWS

శరవేగంగా సాగుతున్న జేఎన్టీయూ నిర్మాణ పనులు

Satyam NEWS

మళ్లీ కృష్ణమ్మకు హారతులు ప్రారంభం

Satyam NEWS

Leave a Comment