40.2 C
Hyderabad
April 29, 2024 17: 03 PM
Slider ముఖ్యంశాలు

మహిళా శిశు రక్షణ కోసం కొత్త చట్టాలు తేవాలి

#SaveGirlChild

సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆడ పిల్లగా పుట్టిన పసికందు కోసం మరో కొత్త చట్టం తీసుకురావాలని విన్నపం ఒక పోరాటం స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు చీకూరి లీలావతి అన్నారు.

ఆడపిల్ల పుట్టిందని చెత్త కుండీలలో, వ్యవసాయ పొలాలలో పడవేసే తల్లిదండ్రులకు తగిన బుద్ధి చెప్పటం కోసం, జైలు శిక్షలు పడే విధంగా కొత్త చట్టం తీసుకురావాలి అని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. కఠినతరమైన చట్టాలను తీసుకురాకపోతే ఆడపిల్లలకి అనాధాశ్రమాలకు, చెత్త కుండీలకు పసికందులకు మరణ శాపంగా మారుతుందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

భర్తను కోల్పోయిన వారికీ శిరోజాలు తీయవద్దని,  పునర్వివాహం జరిపించాలని, గతంలో ఎన్నో పోరాటాలు జరిగాయని చరిత్ర చెబుతుంటే కానీ నేటికీ విడో,వితంతు అనే పేరును కూడా  తొలగించ లేకపోయారని అన్నారు. నేటి పాలకుల అసమర్థత, పురుషాధిక్యత గొప్పగా చెప్పుకోవటానికి నేటికి స్త్రీలను ఈవిధంగా అవమానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.

నేటి స్త్రీలకు ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలన్న భావనతో నాడు సావిత్రిబాయి ఫూలే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని  ఆడపిల్లలకు చదువు  నేర్పిన, నేర్పించిన సావిత్రిబాయి ఫూలే మనకు ఆదర్శం కావాలని అన్నారు. మహిళా రక్షణ కోసం క్రొత్త చట్టాలు తీసుకురావాలని లీలావతి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

బాచిమంచి చంద్రశేఖర్, సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

భార్యామార్పిడి రాకెట్ సభ్యుల్ని అరెస్టు చేసిన కేరళ పోలీసులు

Satyam NEWS

వాహనం నడిపేటప్పుడు డ్రస్ కోడ్ ఉండాలా?

Satyam NEWS

వృద్ధ దంపతులు సజీవ దహనం

Satyam NEWS

Leave a Comment