27.7 C
Hyderabad
April 30, 2024 09: 10 AM
Slider గుంటూరు

విద్యుత్ చార్జీలు పెంపుదలను వ్యతిరేకిస్తూ నిరసన

#electricity charges

రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు చార్జీలు పెంచడానికి ప్రజలపై మోపుతున్న భారానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సిపిఐ నియోజకవర్గ పార్టీ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ చార్జీలు పెంపుదలను వ్యతిరేకిస్తూ మంగళవారం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మంగళగిరి పాత బస్టాండ్ కూడలి వద్ద విద్యుత్ బిల్లులను మంటల్లో తగలబెట్టారు. నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా నియోజకవర్గ కార్యదర్శి తిరుపతయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు భారాన్ని ప్రజలపై మోపమని ఎలక్షన్ ముందు హామీ ఇచ్చారు. సుమారుగా 50వేల కోట్ల భారాలను ఇప్పుడు ప్రజలపై మోపుతున్నారని మండిపడ్డారు విద్యుత్తు తక్కువ ధరకే దొరుకుతున్న మార్కెట్లో అధిక ధరకు కొనుగోలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

విద్యుత్ బారాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం వెనకడుగు వేసేలా ఉద్యమించాలని అన్నారు ప్రజలపై విద్యుత్ బారాలు మోపుతున్నారని కేంద్ర ప్రభుత్వానికి సీఎం జగన్ సాగిలపడి ప్రజలపై విద్యుత్ బారాల మోపుతున్నారని బిజెపి పాలిత రాష్ట్రాలే అమలు చేయని విద్యుత్ సంస్కరణలను ప్రైవేటీకరణ విధానాలలో రాష్ట్రంలో అమలు చేస్తున్నారని విమర్శించార.

కేంద్రం తీసుకొచ్చే సంస్కరణ వల్ల పెట్రోల్ డీజిల్ చార్జీలు రోజువారి ఎలా వడ్డిస్తున్నారు విద్యుత్ చార్జీలు కూడా అలానే ప్రభావం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు తెలియకుండానే స్మార్ట్ మీటర్ల పేరుతో వేల కోట్ల భారం మోపుతున్నారని చెప్పారు. అలాగే సర్దుబాటు చార్జీల విధానాన్ని రద్దు చేయాలని, విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణను ప్రభుత్వాలు విరమించాలని వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ మీటర్లు పెట్టవద్దని డిమాండ్ చేశారు.

విద్యుత్ పంపిణీ సమస్యలకు ప్రభుత్వం చెల్లించాల్సిన బాకాలను వెంటనే చెల్లించాలని హెచ్చరించారు ఆదానితో సహా వివిధ కార్పోరేట్ సంస్థలతో చేసుకున్న అడ్డగోలు విద్యుత్ ఒప్పందాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.మాజీ మున్సిపల్ వైట్ చైర్మన్ నందం బ్రహ్మేశ్వర రావు మాట్లాడుతూ ప్రజల కళ్ళుగప్పి సర్దుబాటు చార్జీల పేరుతో జనం నెత్తిన తాజాగా 6 వేల కోట్ల రూపాయల భారం వేశారని అన్నారు”.

నియోజకవర్గ సహాయ కార్యదర్శి ఆర్లగడ్డ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యుత్‌ బిల్లులు పెంచి ప్రజలకు త్రిబుల్‌ షాక్‌ ఇచ్చిందన్నారు. పెరిగిన బిల్లులతో జనం గగ్గోలు పెడుతున్నారనీ, సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రభుత్వాలు సామాన్యుడి నడ్డి విరిచాయన్నారు.

గత సంవత్సరం కరెంటు చార్జీలు పెంచి 1400కోట్ల రూపాయల భారం మోపారనీఅన్నారు.నియోజకవర్గ సహాయ కార్యదర్శి కంచర్ల కాశయ్య, మండల కార్యదర్శి జాలాది జాన్ బాబు, పిల్లలమర్రి నాగేశ్వరరావు, కాబోతు ఈశ్వరరావు, చిన్ని సత్యనారాయణ, తుడిమెళ్ళ వెంకటయ్య, జవ్వాది, సాంబశివరావు మిట్టబోలు వెంకటేశ్వరరావు, గొహర్ జానీ, దొడ్డి ఈశ్వరరావు, పంతగాని మరియదాసు తదితరులు పాల్గొన్నారు.

Related posts

15-18 వయసు కలిగిన టీనేజీ పిల్లలు తప్పకుండా టికాలు వేసుకోవాలి

Satyam NEWS

కరోనా ఎలర్ట్: ఆశా వర్కర్లకే నిరాశాజనకమైన పరిస్థితులు

Satyam NEWS

నూతన ఆసరా పింఛన్లకు మంజూరు ఇవ్వండి

Satyam NEWS

Leave a Comment