40.2 C
Hyderabad
April 28, 2024 17: 53 PM
Slider కృష్ణ

మచిలీపట్నం జిల్లా లో గన్నవరాన్నికలిపితే ప్రజలకు తీవ్ర నష్టం

#gannavaram

మచిలీపట్నం జిల్లా లో గన్నవరాన్ని  కలిపితే ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని అఖిలపక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గన్నవరం లో నేడు కార్యాచరణ కమిటీ కన్వీనర్ ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. గన్నవరం నియోజకవర్గాన్ని విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో చేర్చాలని వారు కోరారు.

“గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి విజయవాడ జిల్లా తోనే సాధ్యం” అనే నినాదంతో నాలుగు రోడ్ల లో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కూడలిలో అన్ని పక్షాల నాయకులు ప్రసంగించారు.

ఈ సందర్భంగా అఖిలపక్ష కార్యాచరణ కమిటీ కన్వీనర్,సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రణాళిక శాఖ కార్యదర్శి  జి. విజయకుమార్ నిన్న రాష్ట్ర ప్రభుత్వం తరపున మీడియాతో  మాట్లాడుతూ  జిల్లా కేంద్రం ఎంత దగ్గర ఉన్నదనే ప్రాతిపదికన అసెంబ్లీ నియోజక  వర్గాలను సమీపంలోని జిల్లా కేంద్రాల్లో చేర్చమని తెలిపారన్నారు.

ఆయన ఇచ్చిన వివరణ పర్యవసానంగా విజయవాడ లో  అంతర్భాగంగా ఉన్న గన్నవరం నియోజకవర్గాన్ని  85 కిలోమీటర్ల దూరంలో ఉన్న మచిలీపట్నం జిల్లా లో ఎలా చేరుస్తారని ప్రశ్నించారు. రవాణా,విద్య,ఉపాధి,శాంతిభద్రతలు, అంతర్జాతీయ విమానాశ్రయం, కొండపావులూరు లోని  ఎన్. డి. ఆర్ .ఎఫ్, మల్లవల్లి పారిశ్రామికవాడ, వీరపనేనిగూడెం పారిశ్రామిక పార్క్, కేసరపల్లి ఐటి టవర్స్ మొదలైన వీటన్నిటిలో కూడా అభివృద్ధి జరగాలంటే గన్నవరం నియోజకవర్గంలోని 4 మండలాలు ఎన్టీఆర్  విజయవాడ జిల్లాలోనే కలపాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

గన్నవరం నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి పెద్దు వాసుదేవరావు మాట్లాడుతూ గన్నవరం నియోజకవర్గం పూర్తిగా విజయవాడలో కలిసిపోయిందని గన్నవరం నియోజకవర్గం లోని అంతర్జాతీయ విమానాశ్రయం విజయవాడ పేరుమీదే ఉన్నదని గన్నవరం నుండి మచిలీపట్నం వెళ్లాలంటే నేరుగా రహదారి లేదని ప్రజలు జిల్లా కేంద్రానికి ఆర్టీసీ బస్సు లో వెళ్లాలంటే అటు కంకిపాడు మీదుగా కానీ ఇటుహనుమాన్ జంక్షన్ మీదుగా కానీ 85 కిలోమీటర్లు మూడు గంటల పాటు ప్రయాణించి వెళ్లాల్సి వస్తుందని ఈ పరిస్థితులు  దృష్ట్యా గన్నవరం నియోజకవర్గాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ విజయవాడ జిల్లాలోనే కలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమండ్ చేశారు.

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్నా మాట్లాడుతూ విజయవాడ భవిష్యత్తులో గ్రేటర్ సిటీ,అనంతరం మెగా సిటీ గా మారే అవకాశాలు ఉన్నాయని ఇప్పుడు విస్తరణ అంతా గన్నవరం నియోజకవర్గం లోని నున్న, కొండపావులూరు, గన్నవరం ప్రాంతాలపై పడిందని విజయవాడ లో విలీనం కావడానికి గన్నవరం లోని పలు గ్రామాలు గతంలోనే అంగీకార పత్రాలు ఇచ్చాయని  తాజా జిల్లా మార్పులతో  గన్నవరం నియోజక వర్గాన్ని గుడివాడ ఆర్. డి. ఓ పరిధిలోకి తీసుకు వచ్చారని గన్నవరం ప్రాంత ప్రజలకు విజయవాడ 21 కిలోమీటర్ల దూరంలో ఉంటుందాని పేద ప్రజలు పనుల మీద ఎనభై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న మచిలీపట్నం కలెక్టరేట్ కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో గన్నవరం నియోజకవర్గ జనసేన నాయకులు చిమట రవివర్మ, గన్నవరం టౌన్ సి పి ఐ  కార్యదర్శి కాట్రగడ్డ జోషి, గన్నవరం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జాస్తి శ్రీధర్, గన్నవరం లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు వజ్రాల కృష్ణా రెడ్డి తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యదర్శి జూపల్లి సురేష్, ఉంగుటూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆరుమళ్ళ వెంకట  కృష్ణా రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆళ్ల హానొక్, జేఏసీ నాయకులు దండమూడి శ్రీనివాసరావు,  మండవ అన్వేష్, చెరుకూరి రమేష్, తంగిరాల శ్రీనివాసరావు, భూసే నాగ ప్రసాద్, పడమటి రమేష్, కటేవరపు విజయ రావు తదితరులు పాల్గొన్నారు.

ఇదే విషయం మీద ఉంగుటూరు, విజయవాడ రూరల్ మండలాల్లో అఖిలపక్ష సమావేశాలు నిర్వహించి తదుపరి కార్యాచరణ నిమిత్తం ఈనెల 30వ తేదీన  గన్నవరం లో సమావేశం అవ్వాలని అఖిలపక్ష కమిటీ నేతలు నిర్ణయించారు.

Related posts

బంద్ చేస్తున్న రాజంపేట టీడీపీ నేతల అరెస్ట్….

Satyam NEWS

ఈ జీవాయుధాన్ని నిర్వీర్యం చేయడం మన చేతుల్లోనే ఉంది

Satyam NEWS

కరోనాపై యుద్ధానికి మహేష్ బాబు కోటి విరాళం

Satyam NEWS

Leave a Comment