40.2 C
Hyderabad
April 29, 2024 17: 56 PM
Slider వరంగల్

నేరాలకు పాల్పడే వారికి భయాన్ని కలిగించాలి

warangal police

నేరానికి పాల్పడితే కోర్టులో శిక్ష పడుతుండనే భయాన్ని నేరస్థులకు కలిగించాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అధికారులకు సూచించారు. గత సంవత్సరం వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో నేరాలకు పాల్పడిన నేరస్థలకు జీవిత ఖైదు శిక్షను విధించడంలో ప్రతిభ కనరచిన ప్రభుత్వ న్యాయవాదుల, దర్యాప్తు పోలీస్‌ అధికారులతో పాటు, కోర్టు విధులు నిర్వహించే కానిస్టేబుళ్ళను వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ శనివారం ఘనంగా సన్మానించారు.

రానున్న రోజుల్లో వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో నేరాలకు పాల్పడిన నేరస్థుల నేరాలను నేర నిరూపణ చేసి శిక్ష శాతాన్ని గణనీయంగా పెంపొందించే  లక్ష్యంగా నేరస్థుల నేరాలను నిరూపణలో ప్రతిభ కనబరిచిన పోలీస్‌ అధికారులతో పాటు, ప్రభుత్వ న్యాయవాదులను ప్రోత్సహించే దిశగా సి.సి.ఆర్‌.బి విభాగం అధ్వర్యంలో గత సంవత్సరంలో 14 కేసుల్లో 38 మంది నేరస్థులకు కోర్టులో జీవిత ఖైదు శిక్షను విధించడంలో ప్రతిభ కనబరిచిన 30 మంది అధికారులను పోలీస్‌ కమిషనర్‌ చేతు మీదుగా రివార్డు, జ్ఞాపికను అందజేసారు.  

ఇందులో పబ్లిక్‌ ప్రాసీక్యూటర్‌, దర్యాప్తు పోలీస్‌ అధికారితో పాటు, కోర్టు విధులు నిర్వహించే కానిస్టేబుళ్ళు  వున్నారు. ఈ సందర్బంగా పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ ముఖ్యంగా నేరాలను నియంత్రించడంతో పాటు నేరస్థులను కట్టడి చేయాలంటే పకడ్బందీగా దర్యాప్తు నిర్వహించి సరైయిన సాక్ష్యాధారాలను అంటే సాక్షుల వాంగ్మూలాలు కావచ్చు లేదా సాంకేతిక మరియు వైద్య అధా రాలు కావచ్చు సేకరించి వాటి సరైన పద్దతిలో కోర్టుకు సమర్పించడం ద్వారా నేరస్థులకు కోర్టులో శిక్ష విధించడం జరుగుతుంది.

తద్వారా నేరస్థుల్లో నేరాలకు పాల్పడాలంటేనే భయం కలిగే పరిస్థితి వస్తుందని.  ముఖ్యంగా నేరానికి పాల్పడిన నేరస్థుడికి కనీసం ఆరునెలల నుండి ఒక సంవత్సరం లోపైన శిక్ష పడటం ద్వారా  నేరస్థులపై తీవ్ర ప్రభావం పడుతుందని. అందరు సంబంధిత నేరం గురించి మర్చిపోక ముందే నేరస్థుడికి శిక్షను విధించడం ద్వారా నేరస్థులకు నేరాలు చేయాలంటే భయపడుతారని అన్నారు.

నిరూపించడంలో పోలీసు, ప్రభుత్వ న్యాయవాదు సమన్వయంతో పనిచేయడం ద్వారా చక్కటి ఫలితాను రాబట్టగమని పోలీస్‌ కమిషనర్‌ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో డిప్యూటీ డైరక్టర్‌ ఆఫ్‌ ప్రాసీక్యూషన్స్‌ యం.సత్యనారాయణతో పాటు,  పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు శ్రీధర్‌ రెడ్డి, ఉర్వశీ, వీరమల్లయ్య, బాలకృష్ణరావు, సంజీవరెడ్డి, విజయదేవిని పోలీస్‌ కమిషనర్‌ సన్మానించారు. ఈ సమావేశంలో వరంగల్‌, హన్మకొండ ఎ.సి.పిలు సాంగపాణీ, జితేందర్‌రెడ్డి, సి.సి.ఆర్‌.బి ఇన్స్‌పెక్టర్లు శ్రీలక్ష్మీ, చంద్రశేఖర్‌ మరియు వివిధ స్టేషన్ల ఇన్స్‌పెక్టర్లు పాల్గొన్నారు.

Related posts

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక చర్యలు

Bhavani

కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరిన నాయకులు

Satyam NEWS

9న రామ‌తీర్దం పై మత కమిటీ సమావేశం

Satyam NEWS

Leave a Comment