38.2 C
Hyderabad
April 28, 2024 21: 50 PM
Slider జాతీయం

ఢిల్లీకి పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్.. బీజేపీతో జట్టుకేనా?

పంజాబ్ రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యమంత్రి పదవి నుంచి కాంగ్రెస్ పార్టీ కెప్టెన్ అమరీందర్ సింగ్ ను తప్పించిన విషయం తెలిసిందే. తాజాగా మాజీ కెప్టెన్ అమరీందర్ సింగ్ ఢిల్లీకి బయలుదేరుతున్నారు. ఈయన బీజేపీలో చేరతారని ఇప్పటికే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. దీంతో ఆయన ఢిల్లీ ప్రయాణం పంజాబ్ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తోంది.

ఢిల్లీలో ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాను కలవవచ్చని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం పంజాబ్ లో అమరీందర్ ప్రత్యర్థి వర్గాలు కెప్టెన్ స్టాండ్ కోసం వేచి ఉన్నారు. నవజ్యోత్ సిద్ధూతో గొడవ కారణంగా అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీని తరువాత, కాంగ్రెస్ హైకమాండ్ చరంజిత్ చన్నీని ముఖ్యమంత్రిని చేసింది. కెప్టెన్ తన పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి బీజేపీలో చేరుతారని టాక్ బవినిపించినా, అటు బీజేపీ కానీ, ఇటు అమరీందర్ కానీ సమాధానం ఇవ్వలేదు. అయితే, అన్ని ఎంపికలు తెరిచి ఉన్నాయని అప్పట్లో కెప్టెన్ చెప్పారు. ఇప్పుడు అకస్మాత్తుగా ఆయన ఢిల్లీకి పయనం అవుతుండటం.. బీజేపీ ప్రముఖులను కలిసే అవకాశం ఉందని తెలుస్తుండటంతో ఆయన బీజేపీలో చేరవచ్చనే ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి.

Related posts

హూ ఈజ్ ద విలన్: స్కూళ్లలో పోలీసులు ఆరుబయట విద్యార్ధులు

Satyam NEWS

ఉల్లి రైతుకు పొంచి ఉన్న ప్రమాదం

Satyam NEWS

డార్విన్ సిద్ధాంతాన్ని తొలగించడం అన్యాయం…!

Satyam NEWS

Leave a Comment