38.2 C
Hyderabad
April 29, 2024 11: 35 AM
Slider ఆధ్యాత్మికం

రధ సప్తమి సందర్భంగా తిరుమలకు పోటెత్తిన భక్తులు

#Radhasaptami at Tirumala

రధ సప్తమి సందర్భంగా తిరుమలలో భక్తులు పోటెత్తారు. రథసప్తమి వేడుకలను తిరుమల తిరుపతి దేవస్థానం వైభవంగా నిర్వహించింది.

ఇవాళ ఉదయం నుంచి రాత్రి వరకు స్వామివారు ఏడు ప్రధాన వాహనాలపై  భక్తులకు దర్శనమివ్వనున్నారు.

సూర్యప్రభ వాహనంతో మొదలై చంద్రప్రభ వాహనంతో వేడుకలు ముగియనున్నాయి.

ఉదయం ఐదున్నర గంటలకు స్వామివారు సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ పడమర, ఉత్తర మాడవీధులు కలిసే ప్రాంతానికి చేరుకున్నారు.

అక్కడ మలయప్ప స్వామివారిపై సూర్యకిరణాలు తాకిన తరువాత అర్చకులు ప్రత్యేక హారతులు, నైవేద్యాలు సమర్పించి వాహన సేవలను ప్రారంభించారు.

ఉదయం 8గంటల వరకు సూర్యప్రభ వాహనంపై విహరించిన శ్రీనివాసుడు 9 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

11 నుంచి 12 గంటల వరకు గరుడ వాహనంపై, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు.

మధ్యాహ్నం 2 నుంచి 3 వరకు స్వామివారికి చక్రస్నానం చేయించనున్నారు. సాయంత్రం 4 నుంచి 5 వరకు కల్పవృక్ష వాహనంపై, సాయంత్రం 6 గంటల నుంచి 7 వరకు సర్వభూపాల వాహనంపై, రాత్రి 8 గంటల నుంచి 9 వరకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు.

ఒకే రోజున ఏడు వాహన సేవలు దర్శించుకునే అవకాశం ఉండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో కొండకు చేరుకున్నారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో తిరుమాడ వీధులు భక్త జనసంద్రంగా మారాయి.

Related posts

లంచం కోసం వృద్ధుడ్ని కూడా వదలని రెవెన్యూ శాఖ

Satyam NEWS

ములుగుకు ఈ నెల 28న రానున్న మంత్రి హరీశ్ రావు

Satyam NEWS

కొత్త జిల్లాల ఏర్పాటు ఒక సువర్ణాధ్యాయం

Satyam NEWS

Leave a Comment