26.7 C
Hyderabad
May 1, 2025 03: 48 AM
Slider కరీంనగర్

కబడ్డీ టైం:జిల్లాస్థాయి బాలబాలికల జూనియర్ సెలెక్షన్

rajanna siricilla inter dist kabhaddi selections

రాజన్న సిరిసిల్ల జిల్లాస్థాయి బాల బాలికల జూనియర్ కబడ్డీ సెలెక్షన్ ట్రయిల్స్ నిర్వహిస్తున్నట్లు రాజన్న సిరిసిల్ల కబడ్డీ అడహాక్ కమిటీ సభ్యులు ముస్కు మల్లారెడ్డి సింగారపు తిరుపతి బొడ్డు రాములు, ప్రభాకర్ సురేష్ లు ఒక్క ప్రకటనలో తెలిపారు.ఈ నెల 28మధ్యాహ్నం 02గంటలకు ఒక్క రోజు మాత్రమే వేములవాడ అర్బన్ మండలం అనుపురం జడ్ పి హెచ్ ఎస్ లో హాజరు కాగలరని వారు కోరారు.

ఇందులో ఎంపికాగోరు వారు 20 సంవత్సరాల లోపు వయస్సుఉండాలని , 17-02-2000 తర్వాత జన్మించిన వారై ఉండాలి బాలురు 70 కిలోల బరువు లోపు బాలికలు 65 కిలోల లోపు బరువు ఉండాలని ప్రతి క్రీడాకారుడు విధిగా ఆధార్ కార్డు మరియు SSC మెమో ఒరిజినల్ తప్పకుండా వెంట తీసుకొని రావాలని వారు కోరారు.


ఈ నెల 30-01-2020 నుండి 01-02-2020 వరకు 33 జిల్లాల కబడ్డీ టోర్నమెంట్ జనగామ జిల్లాలో నిర్వహించబడును క్రీడా నైపుణ్యత చూపిన వారికి అంతర జిల్లాలో అవకాశం కల్పించబడును .రాజన్న సిరిసిల్లలో గల ప్రతి గ్రామం నుండి జూనియర్ క్రీడాకారులు అనగా బాల బాలికలు అత్యధికంగా పాల్గొనాలని కోరడమైనది.ఇందుకు క్రీడాకారులు సెల్ నంబర్లు 9440337004 ,౯౦౦౦౩౬౨౬౮౬ సంప్రదించగలరని రాజన్న సిరిసిల్ల కబడ్డీ అడహాక్ కమిటీ సభ్యులు ముస్కు మల్లారెడ్డి సింగారపు తిరుపతి బొడ్డు రాములు ప్రభాకర్ సురేష్ లు ఒక్క ప్రకటనలో తెలిపారు

Related posts

జగనన్నే మా భవిష్యత్ – మా నమ్మకం నువ్వే జగనన్న

mamatha

భూపాలపల్లి కలెక్టర్ ను కలిసిన టీయూడబ్ల్యూజే నేతలు

Satyam NEWS

స్పెషల్: మేడారం జాతరకు ప్రత్యేక టూర్ బస్

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!