38.2 C
Hyderabad
April 29, 2024 12: 18 PM
Slider విజయనగరం

ఈబీసీ కింద ఆర్యవైశ్యులకు 70 కోట్లు కేటాయించిన ఘనత సీఎం జగన్ దే

#kolagatla

రాష్ట్రంలో ఈబీసీ కోటా కింద ఆర్యవైశ్యులకు 70 కోట్ల నిధులను కేటాయించిన ఘనత సీఎం జగన్ దేనని డిప్యూటీ స్పీకర్, విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. అలాగే సామాజిక సేవా కార్యక్రమాలలో ఆర్యవైశ్యులు ఎల్లప్పుడూ ముందుంటారని  రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ పేర్కొన్నారు.

నగరంలోని  రింగ్ రోడ్ లో లీ పేరడైజ్ లో  జరిగిన జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన  కార్యవర్గ ప్రమాణ స్వీకార సభలో వారు మాట్లాడారు. . ఈ సమావేశానికి విచ్చేసిన అతిథులు ముందుగా వాసవి మాత చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేశారు. సభకు విచ్చేసిన అతిథులకు సంఘం తరఫున సత్కారాలు చేశారు.

జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గా కుమ్మరిగంటి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి గా మమ్ముల విశ్వేశ్వరరావు, కోశాధికారిగా కు సుమంచి మహేష్ తో పాటు కార్యవర్గ సభ్యులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్ర రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మహాత్మాగాంధీ వారసులు గా ఆర్యవైశ్యులు ప్రత్యేక గౌరవాన్ని సంతరించుకుంటున్నారని అన్నారు.

అదే రీతిలో అవినీతికి తావు లేకుండా నిజాయితీ, నిబద్ధతతో సమాజంలో గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు. ఒక వ్యక్తిగా చేయలేని అనేక కార్యక్రమాలు, సంఘంగా ఏర్పడి శక్తిగా నిర్వహించుకోవచ్చన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. సామాజిక హిత కార్యక్రమాలలో ఆర్యవైశ్యుల సహాయం లేకుండా ఏ ఒక్కటి జరగటం లేదన్నది గుర్తించాలన్నారు.

దివంగత సీఎం కొణిజేటి రోశయ్య  ద్వారా కన్యకా పరమేశ్వరి దేవాలయాల ఆస్తులను కాపాడుకోవడమే కాకుండా దేవాదాయ శాఖ నుండి ఆర్యవైశ్యుల అధీనంలోకి తెచ్చుకోగలిగామని అన్నారు. నగరంలోని రాజారావు మేడ సమీపంలో ఉన్న ఆర్య వైశ్య భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో దానిని పునర్నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు.

అన్ని జిల్లాలలో నూతన కమిటీ లు ఏర్పడి ఆర్యవైశ్య సంఘం మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మండల, డివిజన్ స్థాయిలో కూడా కమిటీలు ఏర్పాటు కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ చైర్మన్ మొక్కాల ద్వారకనాథ్ మాట్లాడుతూ  ఉత్తరాంధ్రలో ఆర్య వైశ్య సంఘాలు సమిష్టి కృషితో సేవలు అందిస్తున్నామని అన్నారు.

విజయనగరంలో గజపతులు పై గెలిచిన దమ్మున్న నాయకుడు ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి చరిత్రలో నిలిచిపోయారని కొనియాడారు. రాష్ట్ర విభజన అనంతరం విజయవాడలో ఆర్యవైశ్య భవనం ఏర్పాటు కావడం అవశ్యం అని అన్నారు.

అందుకు అందరి సహకారం అవసరమన్నారు. 58 రోజులపాటు ఆమరణ నిరాహారదీక్ష చేసి అమరుడైన పొట్టి శ్రీరాములు జయంతి, వర్ధంతిని ప్రభుత్వ కార్యక్రమాలుగా నిర్వహించడం గొప్ప విషయమన్నారు.  చింతామణి నాటకాన్ని రాష్ట్రంలో ప్రదర్శించకుండా ప్రభుత్వం జీవో జారీ చేయడం సంఘం విజయంగా అభివర్ణించారు.

ఈబీసీ కోటా కింద ఆర్యవైశ్యులకు ప్రభుత్వం 70 కోట్లకు పైగా నిధులను మంజూరు చేయడం పట్ల సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు.రాజ్యాంగబద్ధంగా ఆర్యవైశ్యులు మరింత ముందుకు సాగాలని కోరారు. జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన కుమ్మరిరిగంటి శ్రీనివాసరావు మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకాన్ని, ఆశలను అందరి సమిష్టి కృషితో దిగ్విజయంగా నెరవేరుస్తానని అన్నారు.

ఆర్యవైశ్య సంఘం బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో  రాష్ట్ర ఎన్విరాన్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుబ్బా చంద్రశేఖర్, మహాసభ ప్రోగ్రాం చైర్మన్ శరత్ కుమార్, మహిళా అధ్యక్షురాలు నాళం ఆండాళ్, ఆర్యవైశ్య సంఘం ముఖ్య నాయకులు  కుప్పం ప్రసాద్,మిట్టా కరుణాకర్,సాధూ ప్రసాద్,కేదారిశెట్టి సీతారామ మూర్తి,మాటూరి రాంగనాధ్ గుప్తా, మండవిల్లి శ్రీనివాస్ గుప్తా, కోలగట్ల తమ్మన్న శెట్టి, బొడ్డు సత్యనారాయణ, బండారు ఆనందరావు,విజ్జపు సత్యగౌరీ తదితరులు పాల్గొన్నారు.

Related posts

పేదలకు సోనియాగాంధీ రేషన్ కిట్ల పంపిణీ

Satyam NEWS

లిస్బాన్ పబ్ లో పెద్ద ఎత్తున వ్యభిచారం

Satyam NEWS

విద్యార్ధుల సమస్యలపై అవగాహనలేని విద్యా మంత్రి

Satyam NEWS

Leave a Comment