కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికలు వాయిదా వేసే యోచనలో కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రస్తుతం కరోనా వ్యాప్తి కట్టడి కోసం మార్చి 31 వరకు దాదాపుగా సగం రాష్ట్రాలు లాక్ డౌన్ లో ఉన్నాయి.
ఈ కారణంతో రాజ్యసభ ఎన్నికలు వాయిదా వేయాలని సీఈసీ కి గుజరాత్, రాజస్థాన్ ప్రభుత్వాలు లేఖలు రాశాయి. దేశ వ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో 55 రాజ్యసభ స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరగాల్సి ఉంది. మార్చి 26 న రాజ్యసభ ఎన్నికల పోలింగ్ షెడ్యూల్ ఉంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగిసింది.
ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కొందరు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. తెలంగాణ నుంచి కే కేశవరావు, ఆర్ సురేష్ రెడ్డి లు ఏక గ్రీవంగా ఎన్నిక అయిన విషయం తెలిసిందే. 55 మంది ప్రస్తుత రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ఏప్రిల్ 2, 9,12 తేదీల్లో ముగుస్తుంది.