29.7 C
Hyderabad
May 1, 2024 04: 11 AM
Slider ప్రత్యేకం

మావోయిస్టుల చెర నుంచి రాకేశ్వర్ సింగ్ విడుదల

#RakeswerSingh

అయిదు రోజుల క్రితం.. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం బీజ్ పూర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో దాదాపు 20 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.

ఆ ఘటనలో ఓ సీఆర్పీఎఫ్ కోబ్రా దళానికి చెందిన రాకేశ్వర్ కూడా బంధీ అయ్యారు. తాజాగా వారి చెరలో బందీగా ఉన్న సీఆర్పీఎఫ్ జవాన్ రాకేశ్వర్ సింగ్ మన్హాస్ ను విడుదల చేశారు..మావోయిస్టులు.

బస్తర్ జిల్లా కలెక్టర్ కు, ఎస్పీకి ఈమేరకు సమాచారం అందింది. సామాజిక కార్యకర్త ధర్మపాలా శైనీ గోండ్వానా సమాజ్ అధ్యక్షుడు ఒరియా, వందలాదిమంది గ్రామస్తుల సమక్షంలో రాకేశ్వర్ సింగ్ ని అప్పగించారు.

11మంది సభ్యలు బృందం రాకేశ్వర్ సింగ్ విడుదలకోసం మావోయిస్టులతో చర్చలు జరిపింది. ఇందులో ఏడుగురు జర్నలిస్ట్ లు కూడా ఉన్నారు. సుకుమా రేంజ్ లోని టర్రెం క్యాంప్ కు రాకేశ్వర్ సింగ్ ను తీసుకొచ్చారు.

ఈ ప్రాంతంలోనే ఎన్ కౌంటర్ జరిగింది.ఏదైనా.. కలం వీరులు(జర్నలిస్టుల) చొరవతో.. సీఆర్పీఎఫ్ జవాన్.. విడుదల కావడం జరిగింది.

Related posts

హైద్రాబాద్ కాంగ్రెస్ నేత కరోనాతో మృతి

Satyam NEWS

రాజారెడ్డి రాజ్యాంగం నశించాలని రాజ్యాంగ నిర్మాతకు వినతిపత్రం

Bhavani

తెలంగాణ ప్రజా ప్రతినిధుల్ని హతమార్చేందుకు మావోల ప్లాన్

Satyam NEWS

Leave a Comment