35.2 C
Hyderabad
April 27, 2024 14: 35 PM
Slider హైదరాబాద్

కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగం నుంచి రాంచందర్ కి డాక్టరేట్

#Ramchander

మనము ఇప్పుడు సమాచార విప్లవ యుగం లో వున్నాము. మనకు సమాచారం వివిధ ప్రదేశాలు నుంచి మరియు తక్కువ సమయం లో వస్తూ వుంటది. ఈ సమాచారాన్ని మన మేధస్సు తో వర్గీకరణ చేయటానికి ఎంతో సమయం అవసరం.

ఇప్పుడు అంత కృతిమ మేధస్సు (ఎఐ) తో నడిచే పరికరాలు ఆందుబాటులోకి వచ్చాయి . మరి ఈ వర్గీకరణ చేయటనాకి ఒక కలన గణితం (అల్గోరిథం) ఎంతో అవసరం మరియు సవాళ్లు తో కూడుకొన్నది. ఈ వర్గీకరణ చేసిన తరవాత సన్నిహితమైన గుంపు (క్లస్టర్) చేయటం మరింత సవాళ్లు. సిబిఐటి కళాశాల లో ఎంసిఏ విభాగం లో సహాయ ప్రొఫెసర్ ఎం రాంచందర్ ఈ సవాళ్లు కు సమాధానం తాను పిహెచ్ డి థీసిస్ ధ్వారా సమాచార ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడానికి క్లస్టర్ నమూనా చేసినందకు డాక్టరేట్ ను ఉస్మానియా విశ్వవిద్యాలయం లోని కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగం ఈ రోజు ప్రధానo చేసింది.

మెషిన్ లెర్నింగ్ డొమైన్‌లోని పరిశోధకులకు మరియు విద్యార్థులకు సంఖ్యా మరియు వివిధ రకాల సమాచారమును వర్గీకరణ మరియు ఆప్టిమైజ్ చేయడానికి తన చేసిన థీసిస్ ఎంతో ప్రయోజనం పొందుతుంది అని ఒక ప్రకటన లో తెలిపారు. ఈ థీసిస్ కు ప్రొఫెసర్ వై రామ దేవి మార్గదర్శకులు గా వున్నారు.

ఈ సందర్బవం గా రాంచందర్ తన గురువులకు , ఆచార్యులు మరియు కుటుంభం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. సి బి ఐ టి కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి రవీందర్ రెడ్డి , డాక్టర్ బి ఇందిరా , ప్రొఫెసర్ సురేష్ పబ్బోజి , డాక్టర్ డిఎల్ఎస్ రెడ్డి, కళాశాల పి ఆర్ ఓ డాక్టర్ జి ఎన్ ఆర్ ప్రసాద్ మరియు ఇతర అధ్యాపకులు , విద్యార్థులు శుభాకాంక్షలు తెలిపారు .

Related posts

భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము శ్రీశైల పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు

Bhavani

మల్లాపూర్ డివిజన్ లో అంగరంగ వైభవంగా సదర్ ఉత్సవాలు

Satyam NEWS

పొల్యూషన్: విషవాయువులు పీల్చి 6 గురి మృతి

Satyam NEWS

Leave a Comment