30.7 C
Hyderabad
April 29, 2024 04: 47 AM
Slider ఆదిలాబాద్

చౌక దుకాణాల్లో పంపిణీ చేస్తున్న సరకులలో కోత

#Ration Dealer

చౌక ధర దుకాణాల్లో పంపిణీ చేస్తున్న సరకుల్లో కోత విధిస్తూ డీలర్లు పేదలకు అన్యాయం చేస్తున్నారు. నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలోని ప్రజాపంపిణీ సరుకుల ఒకటో నెంబర్ దుకాణంలో ఈ అక్రమ దందా జరుగుతున్నది.

 ప్రభుత్వం రాయితీ  కింద అందిస్తున్న బియ్యం, పప్పులలో లబ్ధిదారుల కోటాలో  కోత విధిస్తున్నారు. జూన్ మాసం లో పప్పు ఇవ్వకుండానే పప్పు లబ్ధిదారులకు ఇచ్చినట్లు ఆన్లైన్ లో  చూపుతుందని జూన్ మాసంలో పప్పు ఇవ్వకుండానే ఎలా నమోదు చేసారని రేషన్ డీలర్ ను ప్రశ్నిస్తే  సమాధానం ఇవ్వకుండా ఎవరికి ఫిర్యాదు చేసుకుంటారో చేసుకోండని దురుసు సమాధానం ఇచ్చారని స్థానికులు అంటున్నారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా ను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ఉచితంగా బియ్యం, పప్పు సరుకులు సరఫరా చేస్తుంటే  డీలర్లు పేద ప్రజలకు అందించే  బియ్యం పప్పులలో  కోత విధిస్తూ ఇష్టరాజ్యంగా వ్యవహరించడం ఏంటని స్థానికులు ప్రశ్నించారు. నిబంధనల మేరకు ఒక్కో లబ్ధిదారుని కి 10 కేజీల బియ్యం తో పాటు రేషన్ కార్డు లబ్ధిదారులకు ఉచితంగా ఓ కేజీ తొగర్ పప్పు ను అందిచాలి.

ఇందులో సైతం కోత విధిస్తున్నారని స్థానికులు  ఆరోపించారు. రేషన్ షాప్ లో తీసుకున్న 20 కేజీ ల బియ్యలో 500 గ్రాములు కోత , కిలో తొగారి పప్పులో  80  గ్రాములు కోత విధించారని అధికారుల దృష్టికి తీసుకవచ్చారు. అవినీతికి పాల్పడుతున్న 1వ నంబర్ డీలర్ ఫై చర్యలు తీసుకోవాలని స్థానికులు తహసీల్దార్ ను కోరారు.

ఈ విషయమై స్థానిక యువత మండల తహసీల్దార్ కు ఫిర్యాదు చేయడంతో గురువారం తహసీల్దార్  శివప్రసాద్ 1 నంబర్ రేషన్ షాప్ ను తనిఖీ చేసారు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.

Related posts

కాగడాలతో నెల్లూరు టీడీపీ నేతల నిరసన

Satyam NEWS

క్లీన్లీ నెస్: పరిసరాల పరిశుభ్రతే మన ఆరోగ్య రహస్యం

Satyam NEWS

దండుమార‌మ్మ ను నిలువునా దోచేసిన దంగలు

Satyam NEWS

Leave a Comment