22.7 C
Hyderabad
July 15, 2024 02: 12 AM
Slider ఆంధ్రప్రదేశ్ సంపాదకీయం

నలుగురు మంత్రుల వ్యూహంలో నలిగిపోయిన ఎల్ వి

mini l v

అందరూ అనుకుంటున్నట్లు కేవలం పరిపాలనా సంబంధిత అంశాలపైనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్ వి సుబ్రహ్మణ్యం అవమానకరరీతిలో తొలగింపు జరగలేదు. దీని వెనుక నలుగురు పవర్ ఫుల్ మంత్రులు చక్రం తిప్పారని విశ్వసనీయంగా తెలిసింది. నలుగురు మంత్రుల కోటరీ  వేసిన మంత్రాంగంలో చిక్కుకుపోయిన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నా అని పిలిచే ఎల్ వి సుబ్రహ్మణ్యం పై వేటు వేయాల్సి వచ్చింది. ఎల్ వి సుబ్రహ్మణ్యం వై వేటు వేసిన తర్వాత వచ్చిన ఫీడ్ బ్యాక్ తో ఒక్క సారిగా ముఖ్యమంత్రి కూడా తీవ్ర ఆందోళనకు గురైనట్లు చెబుతున్నారు.

ఎల్ వి సుబ్రహ్మణ్యం పై వేటు వేయడంతో ప్రభుత్వ ప్రతిష్ట మంటగలిసి పోయినట్లు ముఖ్యమంత్రి ఆలశ్యంగా తెలుసుకున్నారు. అయితే ఆయన ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. ఎల్ వి సుబ్రహ్మణ్యంపై జగన్ కు చాడీలు చెప్పిన క్రైస్తవ లాబీ కూడా ఇంత వేగంతా, త్వరగా తమ పని అవుతుందని ఊహించలేదని అంటున్నారు. ఎల్ వి సుబ్రహ్మణ్యం అక్కడ నుంచి అడ్డుతొలగితే కానీ దేవాలయాల్లో అన్యమతస్థుల ఉద్వాసన ఆగదని భావించిన ఆ లాబీ ముఖ్యమంత్రి పై పలు దఫాలుగా వత్తిడి తీసుకు వచ్చింది. అయితే ముఖ్యమంత్రి ఆ విషయాన్ని మనసులో పెట్టుకున్నారు తప్ప కార్యాచరణలోకి దిగలేదు.

సీనియర్ మంత్రులైన బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొత్త మంత్రులు అయినా కూడా సిఎంకు అత్యంత సన్నిహితంగా ఉండే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కురసాల కన్న బాబు ప్రధాన కార్యదర్శి ఎల్ వి సుబ్రహ్మణ్యం తమకు అడ్డుతగులుతున్న వైనాన్ని సహించలేకపోయారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. తిరుపతి సమీప ప్రాంతాలలో అటవీ భూముల కొనుగోలు వ్యవహారం, రాజధాని భూముల విషయంలో తాము ఆశించిన రీతిలో పనులు జరగకపోవడం, తాము ప్రతిపాదించిన తమ శాఖలకు చెందిన కొన్ని జీవోలు ఆగిపోవడం, రాజకీయ ప్రత్యర్థులపై కక్షసాధింపు చర్యలకు ఎల్ వి వత్తాసు పలుకకపోవడం లాంటి కారణాలతో ఈ నలుగురు మంత్రులు గత కొద్ది రోజులుగా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.

సమయం కోసం వేచి చూస్తున్న వీరికి ఎల్ వి సుబ్రహ్మణ్యం, సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ కు షోకాజ్ నోటీసు జారీ చేయడం కలిసి వచ్చింది. సాధారణ పరిస్థితుల్లో అయితే ప్రవీణ్ ప్రకాశ్ సమాధానంతో అది సమసిపోయేది. అయితే ప్రవీణ్ ప్రకాశ్ కు షోకాజ్ నోటీసు ఇవ్వడం అనేది ముఖ్యమంత్రికి నోటీసు ఇవ్వడం లాంటిదేనని ఈ నలుగురు మంత్రులు ముఖ్యమంత్రికి చెప్పినట్లు తెలిసింది.

ప్రవీణ్ ప్రకాశ్ సాధారణ పరిపాలన ముఖ్య కార్యదర్శి బాధ్యతలే కాకుండా ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నందున ఈ మంత్రులు ఈ లాజిక్ చెప్పడంతో ముఖ్యమంత్రి ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నారని తెలిసింది. ముఖ్యమంత్రి కి ఈ విషయం వివరించడానికి ముందు ఈ నలుగురు మంత్రులు పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి ఛాంబర్ లో సుదీర్ఘ సమావేశం నిర్వహించి ఈ అంశాన్ని సిఎంకు చెప్పి ఆయనతో ఎల్ వి సుబ్రహ్మణ్యం అడ్డు తొలగించుకోవాలని పకడ్బందిగా ప్రణాళిక రచించినట్లు తెలిసింది.

ఎల్ వి బదిలీ చేసిన వెంటనే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ కు ఫోన్ చేసి అభినందనలు తెలిపినట్లు తెలిసింది. ఈ పని ఎప్పుడో చేయాల్సింది ప్రవీణ్ ఇప్పటికైనా సాధించావ్ అంటూ ఆయనకు అభినందనలు చెప్పడం చూస్తే మొత్తం ఎపిసోడ్ ప్రవీణ్ ప్రకాశ్ పేరు మీద జరగాలని ఈ నలుగురు మంత్రులు వేసిన మరో ఎత్తుగడగా చెబుబున్నారు. ఇలా చేయడం ద్వారా తమ పేర్లు బయటకు రాకుండా పని జరిగిపోతుందని వారు పన్నిన వ్యూహం.

Related posts

గుడ్ వర్క్: పోచారం ట్రస్ట్ ద్వారా బియ్యం పంపిణీ

Satyam NEWS

ఈ మున్సిపాలిటీ వారు చట్టం చదవరు..చెబితే వినరు..

Satyam NEWS

DSR ట్రస్ట్ ఆధ్వర్యంలో చురుకుగా సేవా కార్యక్రమాలు

Satyam NEWS

Leave a Comment