30.7 C
Hyderabad
April 29, 2024 06: 22 AM
Slider ఖమ్మం

సామాజిక సేవలో ఐఆర్  సి ఎస్ ప్రధాన పాత్ర పోషించాలి

#red cross

సామాజిక సేవా కార్యక్రమాలలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ( ఐ ఆర్ సి ఎస్) బాధ్యులు, సభ్యులు మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతూ ప్రధాన భూమిక పోషించాలని ఐ ఆర్ సి ఎస్ ప్రెసిడెంట్, జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ పిలుపునిచ్చారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అధ్యక్షతన, కలెక్టరేట్లోని ప్రజ్ఞ మీటింగ్ హాల్లో జరిగింది

జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్ రావు, ఐ ఆర్ సి ఎస్ చైర్మన్ కలిశెట్టి విజయ్ కుమార్, వైస్ చైర్మన్ డాక్టర్ వెలిగేటి చంద్రమోహన్, కార్యదర్శి పులిపాటి ప్రసాద్, మీడియా కన్వీనర్ మైస పాపారావు సమక్షంలో జరిగింది.

కలెక్టర్ ఐ ఆర్ సి ఎస్ ఎజెండా అంశాలపై సమీక్షించారు. గత సంవత్సరం కరోనా లాక్డౌన్ సమయంలో మొదటి విడతగా వచ్చిన కరోనా ను ఎదుర్కొనేందుకు జిల్లాలో రెడ్ క్రాస్ సొసైటీ బాధ్యులు ఫ్రంట్ లైన్ వారియర్స్ కు అందించిన సేవలను ప్రత్యేకంగా అభినందించారు.

ఈ ఏడాది కూడా రెండవదశ కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఐ ఆర్ సి ఎస్ సేవా కార్యక్రమాలను మరింతగా విస్తరింప చేయాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఆ సంస్ద బాధ్యులు ప్రత్యేకంగా చేసిన విజ్ఞప్తి మేరకు కార్యకలాపాల నిర్వహణకు ఖమ్మంలో సొంత భవనాన్ని కేటాయించనున్నట్లు హామీ ఇచ్చారు.

రక్తదాన శిబిరాలు, హెల్త్ క్యాంపులు ఎక్కువగా నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని పేర్కొన్నారు. ఐ ఆర్ సి ఎస్ లాంటి అంతర్జాతీయ సేవా  సంస్థలో బాధ్యులుగా , సభ్యులుగా ఉండడం గొప్ప విషయమని, ఏదో ఒక సేవ చేయాలనే తలంపుతో నే సంస్థలో చేరినందున తమ లక్ష్యం మేరకు సేవా కార్యక్రమాలను విస్తృతం చేయాలని కలెక్టర్ ఆర్ వి కర్ణన్ స్పష్టంచేశారు.

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ని జిల్లాలో బలోపేతం చేయడంతోపాటు సంస్థ కార్యకలాపాలను మరింతగా పెంచాలని ఆకాంక్షించారు. ఐ ఆర్ సీ ఎస్ కు ఉన్న సమస్యలపై చైర్మన్ కలిశెట్టి విజయ్ కుమార్, వైస్ చైర్మన్ డాక్టర్ వెలిగేటి చంద్రమోహన్ లిఖితపూర్వకంగా వివరించారు.

మొదటి విడత కరోనా సమయంలో విస్తృతంగా సేవలు అందించిన జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్, రెడ్ క్రాస్ సొసైటీ హెల్త్ క్యాంప్ ల కన్వీనర్ డాక్టర్ బి. వెంకటేశ్వర్లు ను చైర్మన్ , వైస్ చైర్మన్, సభ్యులు సన్మానించి అభినందించారు.

ఎంతో కీలకమైన ఈ సమావేశం లో పలువురు బాధ్యులు తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్ రావు, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కలిశెట్టి విజయ్ కుమార్, వైస్ చైర్మన్ చంద్రమోహన్, కార్యదర్శి పులిపాటి ప్రసాద్, ట్రెజరర్ గోవర్ధన్ రావు, మీడియా కన్వీనర్ మైస పాపారావు,

ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, బాధ్యులు డాక్టర్ వెలిగేటి విజయలక్ష్మి, సాధినేని జనార్ధన్, అన్నం సేవా సంస్థ చైర్మన్ డాక్టర్ అన్నం శ్రీనివాసరావు, ప్రముఖ పర్యావరణ మిత్ర అవార్డు గ్రహీత, సామాజిక సంఘ సేవకులు ,  ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్ కడవెండి వేణుగోపాల్, జె ఆర్ సి, వై ఆర్ సి కన్వీనర్ షేక్ ముజీబ్, అనాసి రాధాకృష్ణ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మాలతి, డాక్టర్ బాబు జాన్ , షేక్ షకీనా, పలువురు కమిటీల బాధ్యులు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

కొనసాగుతున్న అల్పపీడనంతో వర్ష సూచన

Satyam NEWS

రఘురామకృష్ణంరాజును లాకప్ లో నిజంగానే కొట్టారా?

Satyam NEWS

విజయనగరం జిల్లాలో ఉరుములు, మెరుపులతో అకాల వర్షం..!

Satyam NEWS

Leave a Comment