42.2 C
Hyderabad
April 26, 2024 18: 11 PM
Slider ముఖ్యంశాలు

టీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రకటనలు మానుకోవాలి

#RaghunandanBJP

దుబ్బాక నియోజకవర్గంలో పూర్తైన కొన్ని అభివృద్ధి పనులలను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ రానున్నారని ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు. గత కొంత కాలంగా నిర్మించిన వెంకటేశ్వర దేవాలయం, కెసిఆర్ స్కూల్, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, వంద పడకల ఆసుపత్రి ని వచ్చే నెలలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంబించుకోబోతున్నామని స్పష్టం చేశారు.

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తనను అసెంబ్లీ లో మాట్లాడే అవకాశం కల్పించినందుకు ముందుగా నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజల నమ్మకాన్ని నిలబెడతా

అదేవిధంగా తాను ఎమ్మెల్యేగా గెలిచిన మొదటి సారి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనడం జరిగిందని, నియోజకవర్గ ప్రజలు తనపై ఏ నమ్మకంతో అసెంబ్లీ కి పంపించారో వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా నియోజకవర్గ ప్రజల సమస్యలపై మాట్లాడడం జరిగిందన్నారు. దుబ్బాక పట్టణానికి రింగ్ రోడ్డు, హబ్సీపూర్ నుంచి దుబ్బాక వరకు ఫోర్ లైన్ రోడ్డు తోపాటు పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరడం జరిగిందని, అందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని వివరించారు.

అంతేకాకుండా నియోజకవర్గంలో గత మూడు నాలుగు సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరితే అప్పటికప్పుడు సంబంధించిన అధికారులతో ఫోన్లో మాట్లాడి త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. అదేవిధంగా కూడవెళ్లి వాగులోకి గోదావరి నీరు వదిలామని మంత్రి హరీష్ రావు ఇటీవల చెప్పుకోవడం జరిగిందని కానీ ఆ నీరు ఇంతవరకు దుబ్బాక కు రాకపోవడంపై ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.

ఇంకా ఎన్నిరోజులకు నీళ్లు వస్తాయో?

నిజంగానే గోదావరి నీరు కూడవెళ్లి వాగులోకి వదిలినట్లైతే వాగులో వందల ట్రాక్టర్లు ఎలా ఉంటాయని ప్రశ్నించారు. మిరుదొడ్డి మండలం భూంపల్లి వద్ద ఈరోజు ఉదయం వందల ఇసుక ట్రాక్టర్లు ఉన్నాయని విమర్శించారు. వాగులోకి నీరు ప్రవహిస్తోంది అని చెప్పుకుంటున్న మంత్రి హరీష్ రావు ఇంకా ఎన్ని రోజులకు దుబ్బాక చేరుకుంటాయో చెప్పాలన్నారు.

వాగులో నుండి అక్రమంగా ఇసుకను ఎవరు తరలించుమన్నారని అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక కొంతమంది టిఆర్ఎస్ నాయకులు పనిగట్టుకొని తనపై విమర్శించడం సరికాదన్నారు. వారి విమర్శలు వారి విజ్ఞతకే వదిలేస్తామన్నారు. ఇటీవల ప్రకటించిన జాతీయ రహదారిపై తమ నోటికి వచ్చినట్లు మాట్లాడడం సిగ్గుచేటన్నారు.

గతంలో మీ నాయకులు ప్రతిపాదనలు పంపింది నిజమే అయినా వాటిని ఇంకా ఎందుకు మంజూరు చేయడంలేదని కేంద్ర మంత్రి నితిన్ గట్కరిని కలవడం జరిగిందని స్పష్టం చేశారు. జాతీయ రహదారి కోసం మీరు ప్రతిపాదనలు పంపితే వాటిని త్వరగా మంజూరు చేయాలని ఒక ఎమ్మెల్యే గా తను కోరితేనే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని స్పష్టం చేశారు.

Related posts

అగ్నిపథ్ కు వ్యతిరేకంగా నేడు భారత్ బంద్

Satyam NEWS

గాన అమర్ రహే

Satyam NEWS

అందంగా తీగల వంతెన

Murali Krishna

Leave a Comment