26.7 C
Hyderabad
April 27, 2024 08: 32 AM
Slider గుంటూరు

మా డబ్బులతో మాకు పాల ప్యాకెట్లు ఇస్తే సరిపోతుందా?

#Piduguralla Red Zone

రెడ్ జోన్ డిక్లేర్ చేసి అక్కడి ప్రజలకు పట్టించుకోకుండా ఉంటే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందో గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ లోని రెడ్ జోన్ ప్రాంతాన్ని చూస్తే అర్ధం అవుతుంది. పిడుగురాళ్ళ పట్టణంలో నిన్న మొన్నటి వరకు కరోనా కేసులు లేవు. అయితే లాక్ డౌన్ ఎత్తివేయడంతో ఒక్కసారిగా పదుల సంఖ్యలో పాజిటీవ్ కేసులు వచ్చాయి.

దాంతో కొన్ని ప్రాంతాలను నెల రోజులుగా రెడ్ జోన్ లో ఉంచారు. రెడ్ జోన్ గా ప్రకటించి మిమ్మల్ని కట్టిపడేస్తే మేం ఎలా బతకాలి అని ప్రశ్నిస్తున్నారు పట్టణంలోని బ్రహ్మానందం రెడ్డి కాలనీ మహిళలు. ఆ వార్డులోని ప్రజలు ఇంటిల్లపాది కూలీ పనులు చేస్తేనే కానీ పూట గడవదని అటువంటి పరిస్థితులు నెలకొన్న సమయంలో ఇద్దరికీ కరోనా వచ్చిందంటూ హడావుడి చేసి వారిని ప్రాధమిక పరీక్షలకు తీసుకుపోయి వారం రోజులకే ఇంటకి పంపించారని వారు అన్నారు.

ఆ ఇద్దరికీ వైరస్ ఉన్నదో లేదో అనే విషయాన్ని కూడా తెలపకుండా ఆ ప్రాంతమంతా కంచె వేసి అందరిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు ఆరోపించారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, వాలంటరీలకు ప్రజల  ఆకలి దప్పులు విషయాలను నవ్వులాటగా మాట్లాడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

తమ ప్రాంతంలో మంచినీటి క్యాన్ ఐదు రూపాయలు అయితే వాలంటరీలు పది రూపాయలు తీసుకుంటున్నారని అదేవిధంగా కూరగాయలు, సరుకులు కావాలని అడిగితే డబ్బులిస్తే ఇస్తామని ఇక్కడ ఎవరి డబ్బులు పెట్టుకొని మీ అవసరాలు తీర్చరని హేళన చేస్తున్నారని మహిళలు అన్నారు.

రెండు రోజుల్లో 12 వార్డులోని రెడ్ జోన్ ప్రాంతంలో సదుపాయాలు కల్పించాలని,లేని పక్షంలో రెడ్ జోన్ ఎత్తివేయాలని మా బాధను పట్టించుకోని తరుణంలో మహిళలంతా కలిసి రోడ్డు పై బైఠాయిస్తామని హెచ్చరించారు.

Related posts

ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఇదేం ఖర్మ: బత్యాల

Bhavani

మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం

Satyam NEWS

ప్రొటెక్షన్: గాంధీ ఆసుపత్రి వద్ద కరోనా పోలీసులు

Satyam NEWS

Leave a Comment