27.7 C
Hyderabad
April 30, 2024 07: 08 AM
Slider అనంతపురం

అనంతపురంలో వైభవంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

#Republic Day Celebrations

అనంతపురంలో స్థానిక పోలీసు పరేడ్ గ్రౌండ్స్ నందు 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి, ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామి రెడ్డి, తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిలతో కూడిన ప్రజా ప్రతినిథులు, ఎస్పీ కాగినెల్లి ఫక్కీరప్ప నేతృత్వంలోని పోలీసు సిబ్బంది, జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, అసిస్టెంట్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్ లతో సహా అన్ని శాఖల ఉన్నతాధికారులు మరియు సాధారణ పౌరుల సమక్షంలో జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. జిల్లాల విభజన అనంతరం

జరుపుకుంటున్న మొట్టమొదటి గణతంత్ర దినోత్సవ వేడుకలలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు, ఫ్యామిలీ డాక్టర్ విధానం, నాడు-నేడు విద్య, రీ సర్వే, ఫిష్ ఆంధ్ర, పింఛన్ కానుక, జగనన్న తోడు, వైఎస్సార్ సున్నా వడ్డీ, జగనన్న స్వచ్ఛ సంకల్పం, గడప గడపకూ మన ప్రభుత్వం, గ్రామ-వార్డు సచివాలయాల ఏర్పాటు వంటి కార్యక్రమాలను ప్రధానంగా పేర్కొంటూ జిల్లా కలెక్టర్ ప్రసంగించారు. జిల్లా కలెక్టర్ ప్రసంగం అనంతరం వివిధ శాఖలు ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగాయి.

గ్రామీణాభివృద్ది శాఖ శకటానికి మొదటి బహుమతి

శకటాల ప్రదర్శనలో గ్రామీణాభివృద్ధి శాఖ శకటానికి ప్రథమ బహుమతి దక్కింది. వైఎస్సార్ క్రాంతి పథం పేరుతో ఏర్పాటు చేసిన శకటాన్ని వైఎస్సార్ పింఛన్ పొందుతున్న 15 రకాల లబ్ధిదారులు ముందుండి నడిపించారు. చేయూత-సున్నావడ్డీ, జగనన్న తోడు వంటి పథకాల ద్వారా జీవనోపాధి పెంపొందించి పేదరికంపై చేస్తున్న పోరాటాన్ని శకటం ప్రతిబింబించింది. విభిన్న వర్గాల గ్రామీణ పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే అనేక పథకాలను స్పృశిస్తూ ఏర్పాటు చేసిన శకటానికి ప్రథమ బహుమతి దక్కడంపై డీఆర్డీఏ పీడీ నరసింహా రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.

హౌసింగ్ శాఖ, ఆహుడా సంస్థ ఏర్పాటు చేసిన శకటాల వరసగా రెండు, మూడు బహుమతులు దక్కించుకున్నాయి. డ్వామా, పంచాయతీ రాజ్, వైద్య మరియు ఆరోగ్య శాఖల శకటాలకు ప్రోత్సాహక బహుమతి దక్కింది. పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన స్టాళ్లలో సర్వే మరియు భూరికార్డులు, వైద్య మరియు ఆరోగ్య శాఖ, ఉద్యాన శాఖలు స్టాళ్లు వరసగా మొదటి, రెండు, మూడు బహుమతులు దక్కించుకున్నాయి.

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

గణతంత్ర దినోత్సవ వేడుకలలో దేశభక్తి పెంపొందించే విధంగా వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు చేసిన నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలలో బుక్కరాయ సముద్రం కేజీబీవీ పాఠశాలకు ప్రథమ బహుమతి దక్కింది. కూడేరు కేజీబీవీ, కురుగుంట కేజీబీవీలు వరసగా రెండు, మూడు బహుమతులు దక్కించుకున్నాయి. మిగిలిన పాఠశాల విద్యార్థులతో పాటూ కర్రసాము చేసిన కేఎస్ఎన్ డిగ్రీ కళాశాల విద్యార్థినులు, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ తరఫున కుస్తీ ప్రదర్శన చేసిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ అభినందన పత్రాలు జారీ చేశారు.

అనంతరం 34 మంది జిల్లా ఉన్నతాధికారులకు, అత్యుత్తమ సేవలు అందించిన 360 మంది ప్రభుత్వ ఉద్యోగులకు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి వ్యక్తిగతంగా ప్రశంశా పత్రాలు అందజేశారు. రోడ్డు ప్రమాదాలపై సమాచారం అందించిన ముగ్గురికి గుడ్ సమరిటన్ అవార్డును ప్రదానం చేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన శ్యామసుందర శాస్త్రికి ప్రత్యేక అభినందన పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో మేయర్ వసీం, డిప్యూటీ మేయర్ వాసంతి సాహితి, ఆహుడా చైర్ పర్సన్ మహాలక్ష్మీ శ్రీనివాస్, నాటక అకాడెమీ చైర్ పర్సన్ హరిత తదితర ప్రజాప్రతిథులు పాల్గొన్నారు.

గణతంత్ర వేడుకలలో జెడ్పీ సీఈవో భాస్కర్ రెడ్డి, ఆన్సెట్ సీఈవో కేశవనాయుడు, డీఆర్డీఏ పీడీ నరసింహా రెడ్డి, డ్వామా పీడీ వేణుగోపాల్ రెడ్డి, మెప్మా పీడీ విజయలక్ష్మి, పంచాయతీ రాజ్ ఎస్.ఈ భాగ్యరాజ్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్.ఈ భాగ్యరాజ్, ఆర్డీవోలు మధుసూదన్, నిశాంత్ రెడ్డి, డీపీఆర్వో రమేష్ బాబు, జిల్లా వ్యవసాయ అధికారి చంద్రానాయక్, ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి, జిల్లా పరిశ్రమల అధికారి నాగరాజ రావు, ఎల్డీఎం నాగరాజా రెడ్డి, చేనేత మరియు జౌళి పరిశ్రమల అధికారి

బసవరాజు, సాంఘిక సంక్షేమ అధికారి విశ్వ మోహన్ రెడ్డి, వెనకబడిన తరగతుల సంక్షేమ అధికారి ఖుష్బూ కొఠారి, గిరిజన సంక్షేమ అధికారి అన్నా దొర, మత్స్య శాఖ అధికారి శాంతి, డీఎస్వో శోభా రాణి, ఇంచార్జ్ డీఈవో కృష్ణయ్య , డీఎంహెచ్ఓ వీరబ్బాయి, పీఓఎస్ఎస్ఏ తిలక్ విద్యా సాగర్ తదితర ఉన్నతాధికారులు, పాత్రికేయ మిత్రులు, సాధారణ పౌరులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

పోలీసు సిబ్బంది అంకితభావంతో పనిచేయాలి

Satyam NEWS

సాయిబాబా స్తూపం 24 వ వార్షికోత్సవ వేడుకలు

Satyam NEWS

జిల్లా ఆసుపత్రిగా లింగంగుంట్ల ప్రభుత్వ ఆసుపత్రి

Bhavani

Leave a Comment