40.2 C
Hyderabad
April 29, 2024 16: 21 PM
Slider వరంగల్

పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అక్రమ అరెస్టు అప్రజాస్వామికం

#mulugu congress

ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గృహనిర్భంధం అన్యాయమని ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు. హైదరాబాద్ లోని అత్యంత విలువైన కోకా పేట భూముల బండారం బయట పెడతారనే భయం తోనే రేవంత్ రెడ్డి ని రాష్ట్ర  ప్రభుత్వం  అక్రమ హౌస్ అరెస్ట్ చేసిందని ఈ సందర్భంగా వారు చెప్పారు.

కోకా పేట భూముల అమ్మకం లో ప్రభుత్వ పెద్దల వాటా ఎంత? అని వారు ప్రశ్నించారు. పార్లమెంట్ సమావేశాలకు వెళ్లకుండా రేవంత్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తు ములుగు ఆర్. డి. ఓ రమ దేవి కి వినతి పత్రం అందించారు.

ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నల్లెల కుమారస్వామి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. బంగారు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి ప్రజల ఆస్తులను అమ్మకానికి పెట్టిన డబ్బుల తో అభివృద్ది చేస్తానని అనడం సిగ్గు చేటని వారన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ లో అక్రమ అరెస్ట్ లు అక్రమ కేసులు నిర్బంధాలు తప్ప మరొకటి లేదని, ప్రశ్నించే గొంతు నొక్కే విధానాన్ని ప్రభుత్వం మానుకోవాలని కాంగ్రెస్ నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్, సహకార సంఘం చైర్మన్ బొక్క సత్తి రెడ్డి,వైస్ చైర్మన్ మర్రి రాజు,ఆత్మ డైరెక్టర్ ఆకు తోట చంద్ర మౌళి,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మైస ప్రభాకర్,ఎండీ ఆజ్జు,కంబాల రవి,మామిడి శెట్టి కోటి,సారయ్య,బొచ్చు అశోక్,హరి కృష్ణ,తదితరులు పాల్గొన్నారు.

Related posts

శివుని సొమ్ము దొంగలపాలు: సిద్ధవటం ఆలయంలో ఆగని చోరీలు

Satyam NEWS

కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దేవస్థానం ఈవోగా వేమూరి గోపీ

Satyam NEWS

తెలంగాణకు అమిత్‌ షా… ఖరారైన షెడ్యూల్‌

Bhavani

Leave a Comment