38.2 C
Hyderabad
April 29, 2024 22: 19 PM
Slider ఆదిలాబాద్

రైస్ మిల్లర్లంటే ఎందుకంత చిన్న చూపు?

#ricemills

మిల్లులు ముసేయమంటారా? రైస్ మిల్లర్ల అసోసియేషన్ కొమరం భీమ్ జిల్లా అధ్యక్షుడు చిలువేరు సత్యనారాయణ

రైస్ మిల్లర్లు  నీతి నిజాయితీ తో వ్యాపారం చేస్తూ, ఉన్నదాంతో సేవలు చేస్తే తప్పేంటని,  రాజకీయ నాయకులు పెత్తందారీ వ్యవస్థ విధానం తో సంకుచితంగా ఆరోపణలు చేస్తే సహించేది లేదని కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చిలువేరు సత్యనారాయణ అన్నారు. ఇటీవల  పీ డీ ఎస్ బియ్యం నిలువల తేడా విషయం లో రైస్ మిల్లర్ల ను బదనాం చేస్తూ రాజకీయ నాయకుడు నిన్న కాగ జ్ నగర్ లో ప్రెస్మీట్ పెట్టీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ  మంగళవారం చిలువెరు సత్యనారయణ నివాసం లో అసోసియేషన్ సభ్యులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ రాజకీయ కోణం తో ఆరోపణలు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచన చేయాలన్నారు. సంబంధం లేని విషయం లో ఆరోపణలు బాధకలిగించింది అన్నారు. ఎమ్మెల్యే చేసే అన్నదానం కు బియ్యం దానం చేస్తే దోచుకున్న సొమ్ము ఇచ్చారని, రైస్ మిల్లర్లు దొంగలు అనే విధంగా మాట్లాడడం సహించే విషయం కాదన్నారు. ఇదే విషయం పై మరోసారి మాట్లాడితే రైస్ మిల్ లను తాళం వేసి ముసే స్తమని హెచ్చరించారు.

ఎవరు అన్నదానం చేసిన బియ్యం ఇస్తామని, లేనిపోని మాటలతో రైస్ మిల్లర్లను బద్నాము చేసుడు సంస్కారం కాదన్నారు. అన్నదానం, అంబలి పంపిణీ, సామూహిక వివాహాలు ఇలా ఏ మంచి పనికైనా రైస్ మిల్లర్లు, ఆర్య వైశ్యులు పూర్తిగా అండగా ఉంటామని స్పష్టం చేశారు. తప్పు  చేసినట్లు రుజువైతే  సదరు వ్యక్తి ని మా అసోసియేషన్ నుండి బహిష్కరిస్తామనీ స్పష్టం చేశారు.

రాజకీయ నాయకులు నిజాలు తెలుసుకుని మాట్లాడాలి

జిల్లా లో 8400 క్వింటాళ్ళ బియ్యం కుంభకోణం జరిగిందని, దానికి ఎమ్మెల్యే  పేరు, మార్కెట్ కమిటీ చైర్మన్ పేర్లతో ఆరోపణలు చేయడం పద్దతి కాదని, నిజనిజాలు తెలుసుకోని ఆరోపణలు చేస్తే మంచిదనీ హితవు పలికారు. కుంభకోణానికి మాకు ఎలాంటి సంబంధం లేదని, ఎవరైనా తప్ప చేసినట్లు రుజువైతే మేమే బహిష్కరిస్తామని అన్నారు. రైస్ మిల్లర్ల కు భూములు, వ్యవసాయం ఉందని, ఆ పంట ను దానం చేసే హక్కు లేదా అని ప్రశ్నించారు.

రైస్ మిల్లర్ల సంఘం సెక్రటరీ అదృష్టం వరించి మార్కెట్ కమిటీ చైర్మన్ కావడం తప్పా అని ప్రశ్నించారు. ఆరోపణలు చేస్తున్న నాయకుడు తన ఆరోపణలకు కట్టుబడి ఉంటే ప్రమాణానికి సిద్దమని సవాల్ చేశారు. ఆర్యవైశ్యులు, రైస్ మిల్లర్ల తరపున తాము అక్రమాలు, తప్పులు చేయలేదని వాసవీ మాత మందిరం లో తడిబట్టలతో గుడిలోకి వెళ్లి ప్రమాణం చేస్తామని, ఆరోపణలు చేసిన నాయకుడు తమతో పాటు వచ్చి ప్రమాణం చేసేందుకు సిద్దమా అని సవాల్ చేశారు.

తాను కూడా గతం లో రాజకీయ పరంగా అదే నాయకుడు కు సపోర్ట్ చేశానని చెప్పారు. మేము గతంలో ఇలాంటి నాయకుడిగా సపోర్ట్ చేసిన  మనీ తలదించుకోవాల్సి వస్తుందని ఎవరైనా దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు అన్నదానం చేసినట్లయితే రైస్ మిల్ అసోసియేషన్ తరపున వెయ్యి క్వింటాళ్ల బియ్యం ఫ్రీగా ఇస్తామని…. ఏదైనా తప్పు జరిగినట్లు తెలిస్తే  చట్టపరంగా  ఫిర్యాదు చేయాలని చట్టం తన పని తాను చేసుకొని తప్పు చేసిన వారికి శిక్ష వేస్తుందని సంబంధం లేని మిల్లర్ల పై తప్పుడు ఆరోపణలు చేయడం  సరి అయింది కాదని ఇలాంటి ఆరోపణలు మరోసారి చేసినట్లయితే సరి అయిన సమయంలో తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.

Related posts

కాంగ్రెస్ హిమాచల్ ప్రజలకు అత్యుత్తమ పాలనను అందజేస్తుంది

Murali Krishna

కరోనా ఫియర్: గాంధీ, ఫీవర్ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు

Satyam NEWS

ఎల్డర్స్: కేకే, సురేశ్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు

Satyam NEWS

Leave a Comment