27.7 C
Hyderabad
April 30, 2024 09: 19 AM
Slider వరంగల్

మేడారం జాతర నిర్వహణ కు రూ. 75 కోట్లు

#seetakka

మేడారం జాతర పనుల్లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి సంస్థ & స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. సోమవారం ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని  శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ వన దేవతలను మంత్రి దర్శించుకున్నారు. ముందుగా గోవిందరావు పేట మండలం లోని పసర వద్ద నున్న గుండ్ల వాగు బ్రిడ్జిని, దయ్యలవాగు సమీపం లో ఉన్న  రోడ్డును చింతల్ క్రాస్ వద్ద రోడ్డు ను మరియు పార్కింగ్ స్థలాలను  అనంతరం ఉరాట్టం బ్రిడ్జినీ వాహనాల పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. అదే విధంగా చిలుకల గుట్ట మరియు విఐపి పార్కింగ్ బస్ స్టాండ్ ను పరిశీలించి అధికారులకు  దిశ నిర్దేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఏర్పాట్లు చెయ్యడం జరుగుతుందని,  అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి పనులు వేగవంతం చేసే విధంగా ఉండాలని అధికారులకు పలు ఆదేశాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ గౌస్ ఆలం, ఐటిడిఎ పి. ఓ. అంకిత్, జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ పి. శ్రీజ, డిపిఓ వెంకయ్య, డిఎస్పీ రవీందర్, వివిధ శాఖల అధికారులు,  ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

మల్లన్న దేవుడి కల్యాణ మహోత్సవానికి హాజరైన ఎంపీఆర్

Satyam NEWS

కామెంట్: జగన్ మెప్పు కోసం ఉస్కో బ్యాచ్

Satyam NEWS

డిసెంబరు 30న శ్రీవారి ప్రణయకలహోత్సవం

Sub Editor

Leave a Comment