39.2 C
Hyderabad
April 28, 2024 12: 24 PM
Slider మహబూబ్ నగర్

గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి ఎదగాలి

#kalwakurthysports

యువతరం  క్రీడల్లో పోటీతత్వం అలవర్చుకొని గ్రామీణ స్థాయిలో మంచి ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎదగాలని కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ అన్నారు. కల్వకుర్తి పట్టణ జేఎన్ యూత్ క్రికెట్ జట్టు 15మంది సభ్యులకు స్థానిక 17వ వార్డు పుర కౌన్సిలర్ షేక్ ఏజాస్ ఆయన తండ్రి షేక్ అహ్మద్ మోహియోద్దిన్ (రఫత్) జ్ఞాపకార్థం సమకూర్చిన క్రీడా దుస్తులను బుధవారం కల్వకుర్తి పట్టణంలోని  ప్రభుత్వ అతిథి గృహంలో పట్టణ మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ చేతుల మీదుగా జేఎన్ యూత్ క్రికెట్ జట్టు సభ్యులకు క్రీడా దుస్తులను అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ యువత  చదువుతో పాటు  క్రీడల్లో రాణించాలని సూచించారు.క్రీడలు మానసిక శారీరక ఆరోగ్యానికి పునాదని, క్రీడల వల్ల యువతకు శారీరకపట్టుత్వం,ఏకాగ్రతతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు. యువత క్రీడల్లో గ్రామీణ,పట్టణ స్థాయికే పరిమితం కాకుండా రాష్ట్ర,జాతీయ స్థాయికి ఎదగాలని ఈ సందర్భంగా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పుర కౌన్సిలర్ గోరటి శ్రీనివాసులు,నాయకులు మసూద్,రఫీ,పడకంటి వెంకటేష్,దున్న సురేష్,జేఎన్ యూత్ సభ్యులు జహీర్, ఫిరోజ్, ఇంతియాజ్, సాజిద్, షఫీ, జిలానీ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఆన్ లైన్ ఫ్రాడ్ పై సదస్సు

Sub Editor

ముగిసిన శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి యాగం

Satyam NEWS

మరణించిన హోం గార్డులకు ఆర్ధిక సాయం

Satyam NEWS

Leave a Comment