ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ నేడు బిజెపిలో చేరింది. న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చిన ఆమె బిజెపి సభ్యత్వాన్ని తీసుకున్నారు. హర్యానాలో జన్మించిన సైనా నెహ్వాల్ ఒలింపిక్ క్రీడాకారిణి. కామన్ వెల్త్ గేమ్స్ లో కూడా తన సత్తా చాటిన క్రీడాకారిణి.
ఈ 29 ఏళ్ల బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకు కైవసం చేసుకున్న ప్రధమ భారతీయ క్రీడాకారిణి. ప్రస్తుతం బ్యాడ్మింటన్ లో ఆమె 9వ ర్యాంకులో ఉన్నది. ఢిలీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సైనా నెహ్వాల్ బిజెపిలో చేరడం ఆసక్తి కలిగిస్తున్నది.