కరీంనగర్ లో బిజెపి ఆటలు కట్టిస్తూ టీఆర్ఎస్ జయకేతనం ఎగురవేసింది. కరీంనగర్ కార్పొరేషన్‌లోని మొత్తం 60 డివిజన్లకుగాను 33 డివిజన్లను గెల్చుకుని టీఆర్‌ఎస్ ఇక్కడ అధిక్యం సాధించింది. బీజేపీ ఇక్కడ కేవలం 13 స్థానాలకే పరిమితం అయింది. స్వతంత్ర అభ్యర్ధులు 7 స్థానాలలో గెలుపొందగా వారంతా టీఆర్ఎస్ పార్టీకి తమ మద్దతు ప్రకటించారు. దాంతో టీఆర్ఎస్ పూర్తి మెజారిటీ సాధించినట్లయింది. సీనియర్ నాయకుడు సునీల్‌రావును కరీంనగర్ మేయర్ పీఠం వరించింది. మేయర్‌గా ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ టీఆర్‌ఎస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది.