30.7 C
Hyderabad
April 29, 2024 03: 10 AM
Slider జాతీయం

సమాజ్‌వాది పార్టీకి దెబ్బ.. బీజేపీలోకి నలుగురు నేతలు

వచ్చే ఏడాది జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న వేళ సమాజ్‌వాది పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన నలుగురు ముఖ్య నేతలు ఎస్పీకి గుడ్‌బై చెప్పి.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

సమాజ్‌వాది పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్సీలు రవి శంకర్ సింగ్ పప్పు, సీపీ చంద్, అక్షయ్ ప్రతాప్ సింగ్, రాం నిరంజన్‌లు యూపీ డిప్యూటీ సీఎంలు దినేష్ శర్మ, కేశవ్ ప్రసాద్ మౌర్య, యూపీ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు స్వతంత్రా దేవ్ సింగ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. బీజేపీలో చేరిన వీరు నలుగురూ గతంలో స్థానిక సంస్థల కోటాలో సమాజ్‌వాది పార్టీ నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికైయ్యారు.

వచ్చే ఏడాది మార్చి నెలతో వీరి పదవీకాలం ముగియనుంది. వీరికి ప్రజాబలం ఉండడంతో, ఎన్నికల్లో బీజేపీకి కలిసొచ్చే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వచ్చే ఏడాది జరిగే స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులుగా తాము విజయం సాధిస్తామని వారు ధీమాతో ఉన్నట్లు తెలుస్తోంది.

Related posts

త్వరలో విడుదలకు సిద్ధమైన క్రేజీ అంకుల్స్

Satyam NEWS

శ్రీశైలం వద్ద కృష్ణా జలాల్లో విహరించిన కేంద్ర ప్రభుత్వ అధికారులు

Satyam NEWS

చితకొట్టుడు 2 చిత్రం.. గోష్ట్ వెర్ష‌న్ 2.0 ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Sub Editor

Leave a Comment