28.7 C
Hyderabad
April 27, 2024 06: 07 AM
Slider ప్రత్యేకం

పర్యాటక రంగ ప్రాజెక్టులపై కిషన్ రెడ్డిని కలిసిన సత్తిబాబు

#minister kishanreddy

ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా తీర ప్రాంతంలో విస్తృతమైన పర్యాటక రంగ ప్రయోజనాలు ఉన్నందున వాటిపై దృష్టి సారించాలని ప్రముఖ సంఘ సేవకుడు, జిఎన్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ముత్యాల సత్యనారాయణ (సత్తిబాబు) కోరారు.

ఈ మేరకు ఆయన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి ఇన్ చార్జి జి. కిషన్ రెడ్డి ని నేడు న్యూఢిల్లీలో కలిసి చర్చించారు.

అదే విధంగా తెలంగాణ లోని పలు అటవీ, నదీపరీవాహక ప్రాంతాలు పర్యాటకులను విశేషంగా ఆకర్ఫించేందుకు అన్ని హంగులతో ఉన్నాయని సత్తిబాబు వివరించారు.

ఇప్పటికే తెలంగాణ లోని రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు తీసుకురావడంలో విశేష కృషి చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి సత్తిబాబు ధన్యవాదాలు తెలిపారు.

గతంలో మెగాస్టార్ చిరంజీవి కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రిగా ఇండిపెండెంట్ చార్జితో పని చేశారని, ఇప్పుడు కేంద్ర క్యాబినెట్ మంత్రిగా కిషన్ రెడ్డి నియమితులు కావడం తెలుగు రాష్ట్రాల అదృష్టమని సత్తిబాబు అన్నారు.

రెండు తెలుగు రాష్ట్రాలపై సంపూర్ణ అవగాహన ఉన్న కిషన్ రెడ్డి నేతృత్వంలో మరింత మేలు జరుగుతుందని ఆయన ఆశించారు.

ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల సమగ్ర అభివృద్ధికి సంబంధించి చేపట్టాల్సిన పర్యాటక ప్రాజెక్టులపై సత్తిబాబు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వివరించారు.

అన్ని విషయాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు.    

Related posts

తెలంగాణ లో రికార్డు స్థాయిలో అడవుల పెరుగుదల

Satyam NEWS

కరోనాపై పోరాడుతున్న ప్రతి ఒక్కరికీ ఈ గీతం అంకితం

Satyam NEWS

మునిగిపోతున్న మహిళల్ని కాపాడిన పోలీసులు

Bhavani

Leave a Comment