37.2 C
Hyderabad
April 26, 2024 20: 09 PM
Slider మహబూబ్ నగర్

మొక్కలు నాటుదాం పర్యావరణాన్ని కాపాడుకుందాం

#Jupally Krishnarao

సీఎం  కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మాజీ మంత్రి సీనియర్ టీఆర్ఎస్ నాయకుడు జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. ప్రతిఒక్కరు ఒక్కో మొక్క నాటి పర్యావరణ పరిరక్షణ కు కంకణ బద్ధులు కావాలని, రాష్టాన్ని హరిత తెలంగాణ గా తీర్చిదిద్దాలని ఆయన అన్నారు.

కొల్లాపూర్ మున్సిపాలిటి పరిధిలోని తాళ్లనర్సింహపురం గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఏర్పాటుచేసిన హరిత హారం కార్యక్రమానికి ఆయన నేడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఈత చెట్లను నాటారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రజలు స్వచ్చందంగా గ్రామాలను పచ్చదనంతో వెల్లూవిరిసేలా  కృషిచేయాలని ప్రతి ఇంటి ముందు ఒక మొక్కను నాటి వాటి సంరక్షణ కు బాధ్యత తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు నగర పంచాయతీ కౌన్సిలర్ లు సింగిల్ విండో డైరెక్టర్ లు యువకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

చదువుతో పాటు సామాజిక సృజనాత్మకత,కళలు విద్యార్థులకు అవసరం

Satyam NEWS

ఉపాధి నిధులను వెనక్కి పంపమనడం సిగ్గుచేటు

Bhavani

హుజూర్‌నగర్ లో బస్తీ దవాఖానా ఏర్పాటు చేయాలి

Satyam NEWS

Leave a Comment