32.7 C
Hyderabad
April 27, 2024 00: 14 AM
Slider కవి ప్రపంచం

అక్షర బ్రహ్మకు అక్షరాంజలి

#J.Shyamala

చిన్ననాటనె నిజామును నిరసించినవాడు

వందేమాతరమంటూ దేశభక్తి ప్రకటించినవాడు

అక్షరశక్తిని ఔపోసన పట్టిన వాడు

పదహారు భాషలను ‘పట్టు’ పట్టినవాడు

‘వేయిపడగలు’ నవలను ‘సహస్రఫణ్’ గా అనువదించినవాడు

‘ఇన్ సైడర్’ తో ఖ్యాతి ఇనుమడించిన వాడు

విద్యా మంత్రిగా వినుతికెక్కినవాడు

ముఖ్యమంత్రిగా మన్ననలొందినవాడు

తొలి తెలుగు ప్రధానిగా తేజరిల్లినవాడు

ఆర్ధిక సంస్కరణలెన్నో చేపట్టినవాడు

ఒడుదుడుకులను ఒడుపుగా ఎదుర్కున్నవాడు

పాండిత్యంలో వాచస్పతిగా వెలుగొందినవాడు

రాజకీయంలో బృహస్పతిగా పేరొందిన వాడు

ఎవరయ్య ఆ ఘనుడు?

ఎవరయ్య ఆ ప్రాత:స్మరణీయుడు?

ఇంకెవరయ్య మన తెలుగు ఠీవి పీవీ

జె.శ్యామల

Related posts

జ్ఞాన సమాజాన్ని నిర్మించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే

Satyam NEWS

లిక్కర్ స్టోరీ: మందలించినందుకు యువకుడి ఆత్మహత్య

Satyam NEWS

ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి

Satyam NEWS

2 comments

Ramana Velamakakanni October 8, 2020 at 3:45 PM

Befitting tribute to PV sir.Abhinandanalu Syamala garu

Reply
Mramalakshmi January 16, 2021 at 5:48 PM

Excellent Shayamala madam garu

Reply

Leave a Comment