Slider కవి ప్రపంచం

ప్రకృతికి ప్రణామం

#sandhyasutravy new

వింతలు ఎన్నో

ప్రకృతి చెంత

కొండలు గుట్టలు

త్రికోణాలు  బొర్లించినట్లు శిఖరాలు

దానిపై పలురకాల తరువులు

లో రాళ్ళు కనిపించకుండ

హరిత క్యాన్వాసు పరచినట్లు

విస్తరించిన వైవిధ్యభరిత

పత్రవిన్యాసం వర్ణరంజితం

చూడ తనువు మైమరపుతో

ఒకింత పులకింత

సూర్యోదయ సూర్యాస్తమయాల

ఇంద్రచాపాలు కన్నులకు పండుగ

చెట్లపైనా కింద ఎన్నో జీవరాసులు

మనఊహ కందనంత

నదులు వంకలు వాగులు

సస్యశ్యామలం చేస్తూ

పునరుజ్జీవనానికై మేల్కొలుపు

కారుమబ్బులు బరువుగా

ఎక్కడ దించేద్దామా అని

శీతలసమీరాలతో

ఆకుల గలగలలు

జంతువులు పక్షులు

క్రిమికీటకాల రావాలు

కొండలను తొలిచి చేసిన

రహదారి వలయాలు

నల్లని కొండచిలువ ను

పోలిన వంకరటింకర

ఎత్తుపల్లాల రోడ్ల దొంతర

కొండలకు గోధుమవర్ణ

మణిహారాలు తొడిగిన గోచరం

ఎత్తుపల్లాలలో వాహనప్రయాణం

నల్లేరుపైన  నడక కాదు

ధీటైన ఘాటురోడ్డులో

తీవ్రమైన హెచ్చరికతో

ప్రకృతి చేస్తుంది ఓసవాల్ !

ఎంతెత్తు ఎదిగిన

నా ఘాటు తోవలో

నిదానమే నీ ప్రయాణం

వేగం శృతి మించొద్దని

కొండలమధ్య నుండి అక్కడక్కడా వెండిజలతారుల జలజలా

జారే జలపాతాల

సవ్వడుల సంగీత కచేరీలు

కొండల నడుమ లోతైన ప్రదేశాలు

చక్కటి చల్లని వాతావరణంతో

ఆహ్లాదపరుస్తూ ఆహ్వానించే

మజిలీలే వ్యాలీలు

నిరంతరంగా సాగే జీవనచక్రంలోంచి

ఒకింత సేద తీరాలని తపించే

ప్రకృతిప్రియులకు భూతలస్వర్గాలు

ఎప్పుడో ఒకప్పుడు చూసి

తన్మయం పొందాల్సిందే

ప్రకృతికి ప్రణామం   

అంటూ తరించాల్సిందే !

సంధ్య సుత్రావె, ఫోన్ : 9177615967, హైదరాబాద్

Related posts

రాజకీయాల కోసం అసెంబ్లీని వాడుకున్న కేసీఆర్

Satyam NEWS

Talking Point: జగన్ ప్లేస్ లో నేనే కనుక ఉంటే….

Satyam NEWS

క్లియర్: బీజేపీ అమరావతికి అండగా ఉంటుంది

Satyam NEWS

Leave a Comment