29.7 C
Hyderabad
May 2, 2024 04: 34 AM
Slider కవి ప్రపంచం

హిందూత్వం

#Devalapally Sunanda

వైదిక వాఙ్మయాలకు

భారత భాగవతాలకు

రామాయణ ఇతిహాసాలకు

భగవద్గీత లాంటి ఎంసైక్లోపీడియాలకి

పుట్టినిల్లు మన హిందూదేశం

ఎన్నెన్నో ఖనిజ లవణాలకు

ఖగోళశాస్త్ర నక్షత్రాల లెక్కలకు

కోట్ల విలువైన వజ్ర వైడూర్యాలకు

శుశ్రూతుని వైద్యవిద్యకి

ఏకలవ్యుని విలువిద్యకి

చదువులతల్లి సరస్వతీ మాతకు

పుట్టినిల్లు మన భారతదేశం

ప్రపంచం కన్నుతెరవక ముందే

పట్టుబట్టలు నేసి

ఆరుగజాల చీరతో అలరారిన దేశం

సాంప్రదాయాల మాటున

ఆరోగ్యరహస్యాలను మూటగట్టి

దాచిపెట్టి వారసత్వంగా అందింస్తున్న దేశం

రాజ్య పరిపాలనలోను

ప్రజల జీవన విధానంలోను

కోటల కట్టడాలలోను దేవళాలలోనూ

పద్యాలలోను ప్రభంధాలలోను

పిల్లకాలువలలోను

సముద్రగర్భంలోను

హిందూత్వం జెండా ఎగరేస్తుంటే

ప్రపంచ నలు మూలలనుండి

హిందు దేశంపై దండెత్తి వచ్చిన

అందరి మతాలను తనలో కలుపుకుని

సర్వమానవ సమానత్వానికి

ప్రతీకయై

ప్రత్యేకమై వెలుగొందినది మన దేశం

జై భారత్ జై జై భారత్

అంటూ అందరి పొగడ్తలకు

అర్హమై అనునిత్యం అలరారుతున్నది

దేవలపల్లి సునందా రెడ్డి

Related posts

ఇలా చేస్తే కాండ్రించి ముఖాన  ఉమ్మేస్తారు

Satyam NEWS

ఇష్టంలేని పెళ్లి చేశారని ప్రేమికుల ఆత్మహత్య

Bhavani

ఎన్టీఆర్ ట్రస్ట్ డిజిటల్ క్యాలెండర్​ ఆవిష్కరించిన నారా భువనేశ్వరి

Satyam NEWS

Leave a Comment