40.2 C
Hyderabad
April 29, 2024 18: 29 PM
కవి ప్రపంచం

పితామహుడు మన పీవీ

#Polayya Kavi

కష్టాలను కనురెప్పల మాటున

అవమానాలను అంతరంగాన

ప్రత్యర్థుల విమర్శల గరళాన్ని

కంఠాన దాచుకున్న భోళాశంకరుడు

రాజకీయ రుషి మన పాములపర్తి నారసింహుడు

గుండెబలంతో, రాజకీయ చతురతతో

అత్యున్నత పీఠమైన ప్రధానమంత్రి పదవిని

అలంకరించి భారత రథ చక్రాలను నవ్వుతూ

ఐదేళ్ళు నడిపించిన భారత రథసారథి

సాటిలేని మేటి మన పాములపర్తి నారసింహుడు

స్వాతంత్ర్య సమరయోధుడు

వ్యూహరచనా దురంధరుడు

కాకలుతీరిన రాజకీయనాయకుడు

అపరచాణక్యుడు,ఆర్థిక సంస్కరణలకు,

పితామహుడు మన పాములపర్తి నారసింహుడు

రాజనీతిజ్ఞతకు నిలువెత్తు నిదర్శనం

స్థితప్రజ్ఞతకు చెరగని సంతకం, శాంతమూర్తి

తెలుగు గడ్డ మీద పుట్టి గల్లీ నుండి ఢిల్లీకి చేరిన

తెలంగాణ బిడ్డ మన పాములపర్తి నారసింహుడు

ఇన్సైడర్ నంటూ ఆత్మకథను వ్రాసుకొన్న

వేయిపడగలను హిందీలోకి అనువదించిన సాహితీసార్వభౌముడు,బహు భాషాకోవిదుడు

ప్రపంచాన కాగడా పెట్టి వెతికినా కాని కనిపించని

18 భాషలు నేర్చిననేత పాములపర్తి నారసింహుడు

నిన్న తెలంగాణ మట్టిలో పుట్టిన ఆ మొక్క

నేడు విశ్వమంతా విస్తరించిన ఓ వటవృక్షం

అట్టి మహనీయునికి ఆ అపరమేధావికి

ఆ ఆదర్శమూర్తికి ఈ శతజయంతి

ఉత్సవాలలో అర్పిస్తున్న అక్షర నీరాజనం

జయహో ! జయహో ! ఓ జాతినేత !

పాదాభివందనం ఓ పాములపర్తి నరసింహా!

మీ స్మరణే ! మా తెలుగుజాతికి ఓ ప్రేరణ !

నిత్యం మీ అడుగుల్లో అడుగులు వేస్తాము !

నిరంతరం మీ ఆశయాలకు అంకిత మౌతాము !

పోలయ్య కవి, కూకట్లపల్లి, అత్తాపూర్,  హైదరాబాద్, సెల్ నెం: 9110784502

Related posts

మా పల్లె సంక్రాంతి

Satyam NEWS

అభివందనం

Satyam NEWS

బతుకమ్మవే

Satyam NEWS

Leave a Comment