30.7 C
Hyderabad
April 29, 2024 03: 51 AM
కవి ప్రపంచం

రాజనీతిజ్ఞుడు

#Ammana Chandrareddy

కం 01 :సింగారమొలుకు గ్రామము

వంగరలో జననమొంది

వరలెను జగతిన్

రంగారు గుణము గల్గిన

బంగరు హృదయ జననేత

ప్రాజ్ఞుడు పీ.వీ.

కం 02: బహుభాషా కోవిదుడై

సహనము నిండిన మనీషి

చతురుండతడున్

సహచర గణములు మెచ్చగ

మహనీయత జూపినట్టి

మాన్యుడు పీ.వీ.

కం 03: మిక్కిలి సంస్కరణమ్ముల

చక్కగ సల్పి మనదేశ

సంపద బెంచెన్

ఒక్కడు పదుగురి తోడై

చిక్కని పాలనము జేసె

శ్రియముగ పీ.వీ.

కం 04: నీతిని దేశాన నిలిపి

ఖ్యాతిని యంతట గడించె

కరుణా మూర్తిన్

జాతిని రక్షింపగ తా

జేతగ పాలించె మనల

చేవగ పీ.వీ.

కం 05: భారత ప్రధాని పదవిని

ధీరతతో నెఱపె తాను

ధిషణా పటిమన్

మీరక విధినమరుండై

తారగ గగనాన నిలిచె

ధన్యుడు పీ.వీ.

కీర్తి పురస్కార గ్రహీత,శతకశ్రీ అమ్మన చంద్రారెడ్డి, సిద్దిపేట, చరవాణి :  9948936083

Related posts

తొలి జల్లు పలకరింపు

Satyam NEWS

ఓంకార నాదా

Satyam NEWS

అలుపెరుగని బాటసారి

Satyam NEWS

Leave a Comment