40.2 C
Hyderabad
April 29, 2024 17: 44 PM
Slider కవి ప్రపంచం

ప్రగతి దివ్వెలు

#Puli Jamuna

పిల్లలం మేము పిడుగులం

విరిసీ విరియని పువ్వులం

మురిపించే సిరి మువ్వలం

ముచ్చట గొలిపే నవ్వులం ll పిల్లలంll

చింతలు తెలియని బాలలం

రివ్వున ఎగిరే గువ్వలం

చిలుకపలుకుల హరివిల్లులం

చిట్టిపొట్టి ముద్దుల చిన్నారులం ll పిల్లలంll

సంతోషాలకు ప్రతిరూపాలం

స్నేహ భావ సుమపరిమళాలం

సమతను పంచే శాంతికిరణాలం

సాంత్వన నొసగే పసిపిల్లలంll పిల్లలంll

కల్మషమెరుగని మరు మల్లెలం

ఆటాపాటల అల్లరి బుడుగులం

అమ్మానాన్నల కంటి వెలుగులం

భవ్యభారతికి ప్రగతి దివ్వెలంllపిల్లలంll

పులి జమున, మహబూబ్ నగర్, 8500169682

Related posts

సర్దార్ వల్లభభాయి పటేల్ సేవలు చిరస్మరణీయం

Satyam NEWS

ఎస్.సి, ఎస్.టి యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలి

Satyam NEWS

RBK లలో రైతుకు మేలు శూన్యం

Bhavani

Leave a Comment