29.7 C
Hyderabad
April 29, 2024 09: 41 AM
Slider కవి ప్రపంచం

అతి – అనర్థం

#Manjula Surya New 23

మతి లేని పనులతో

అతి చేయుట వల్లనే

వెతలను వెతికి తెచ్చుకున్నాడు

ముప్పును తన తప్పుకు బదులుగా

కొనితెచ్చుకుంటున్నాడు

అంతా ప్రకృతి ఆనతి లేని

వికృతి పనులే

ఆకృతికే మోసం తెచ్చే

నాగరికత ముసుగులో వికృత విధానాలే

ప్రకృతి సిద్ధ వరాలన్నింటినీ

చేతులారా శాపాలుగా మార్చుకుంటున్న వైనం

వాతలు తగులుతున్నా

మార్పు కానరాని మనిషి నైజము

బ్రతుకు పట్టాలు గతి తప్పుతున్నా

కుటుంబాలు దుర్గతికి లోనవుతున్నా

తన చితిని తానే పేర్చుకుంటాడే కానీ

ఈ విపత్తుకు తన చేతివాటం

కూడా ఉందని చింతించడే

మనఃస్థితిలో మార్పు రానంతవరకు

మన స్థితిలో కనపడదులే రాయంచ మార్గం

పరుల దుస్థితిలో చేయుతనందివ్వడం తప్ప

పరిస్థితిలో మార్పును ఆశించలేవు

ప్రకృతిలో భాగం నీవు

నీకు హితమైతే చాలదు

పరహితం కూడా ఆలోచిస్తేనే

జనహితమైన పర్యావరణం

కీకారణ్యం లా భయపెట్టకుండా

నందనవనంలా భాసిల్లుతుంది

నవీనంగా ఉన్నా విలువలతో

శోభిల్లుతుంది

అపుడే పంచభూతాలు కూడా

ప్రాణికోటిని  కాపాడే పంచప్రాణాలుగా

మానవాళికి కవచకుండలాలుగా

జగత్తును బహు జాగ్రత్తగా కాపాడే

జగత్ రక్షకుల్లా వ్యవహరిస్తాయి

మంజుల సూర్య, హైదరాబాద్

Related posts

స్కిల్ డెవలప్ మెంట్ లో మహిళలకు 30 రోజుల శిక్షణ

Satyam NEWS

భారత్ జోడో సరే రాజస్థాన్ కాంగ్రెస్ జోడో ఎప్పుడు?

Satyam NEWS

లక్ష పత్రి పూజా కార్యక్రమంలో ఎమ్మెల్సీ తోట

Bhavani

Leave a Comment