38.2 C
Hyderabad
April 29, 2024 20: 28 PM
Slider కవి ప్రపంచం

గణతంత్రమా…

#K.HarinathRepublicDay

ఎగురవే ఎగురవే

స్వాతంత్ర్యపు జెండా

గణతంత్ర మహా యజ్ఞ

జయతంత్ర కేతనమా

అమర వీర త్యాగధనుల

రణ ఫలితమా..!

నవ్య భారత జననీ

నమో దివ్య ధరణి

ఉద్యమమే ఊపిరిగా

ఉద్వేగం ఉషస్సుగా

భగభగ మండే

అగ్ని జ్వాలలా

భగత్ సింగ్ చరిత్ర పుటలు

అల్లూరి కంటిమంటలు

ఆవిర్లై ప్రజ్వలింప

తెల్లదొరల గుండెల్లో

ఫిరంగులై మ్రోగంగా

పర దాస్య శృంఖలాల

విచ్ఛేదనకై శంఖము  పూరించగ

శాంతి యోధ సమర దూత

జాతి నేతల సాక్షిగా..!

ఉద్భవించిన గణతంత్రమా…!

నమో.. నమో.. నమో..

నవ భారత గణతంత్రమా..

నీకివే సుమాక్షర మాలలు..

గైకొనుమా మంగళ హారతులు…!!

కె హరనాథ్, చరవాణి:9703542598

Related posts

What a Joke: ముచ్చటగా మూడో సారి…!

Satyam NEWS

వేద విద్వ‌త్ ఆగ‌మ స‌ద‌స్సుకు మెరుగ్గా ఏర్పాట్లు

Satyam NEWS

తెలంగాణలో ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ లు

Satyam NEWS

Leave a Comment