32.7 C
Hyderabad
April 26, 2024 23: 04 PM
Slider కవి ప్రపంచం

మన ఠీవి

#P V Narasimharao 2

వేషభూషణం అతి సామాన్యం

ఆలోచనలు ఆచరణలు

అనన్యసామాన్యం

ఆర్భాటము రాదు ఆడంబరము లేదు

ఎదిగినకొద్దీ ఒదిగే జ్ఞాని విజ్ఞాని

తెలుగు ప్రజల వెలుగుల గని

భారతావని ఠీవి మన పీవీ

గర్జించని సింహం ఈ నరసింహం

కుగ్రామము నుండి కురుక్షేత్రము వరకు

అంచెలంచెలుగా ఎదిగిన దక్షిణాద్యుడు

పట్టాలు తప్పిన ప్రభుత్వాన్ని

గట్టెక్కించిన రాజకీయ ధురందురుడు

కుదేలైన ఆర్థికాన్ని సమర్థవంతంగా

మార్చిన అసామాన్య మేధావి

మైనంలా కరిగిపోతుందన్న

మైనారిటీ ప్రభుత్వం పస తెలిపేలా

చేసిన అపర చాణక్యుడు

బహుభాషలు నాలుకపై నాట్యమాడుతున్నా

మౌనాన్ని ఆశ్రయించిన సిధ్ధయోగి

విషంలా చిమ్ముతున్న పెను సవాళ్ళను

ఓరిమితో ఎదుర్కొన్న పరిపూర్ణుడు

నవభారత నిర్మాణానికి పునాదులు వేసిన

సంస్కరణల పితామహుడు

కలాన్ని కాలంతో సమానంగా పరుగులు

పెట్టించగల సరస్వతీ మానస పుత్రుడు

తను నాటిన విత్తు ఎన్నో విపత్తులనుండి బయటపడేసే అమూల్యమైన సొత్తు

డోలాయమానమైన పరిశ్రమలకు అదే

పెద్ద దిక్కు

భారతరత్నకు నోచుకోకుంటేమి

ఈ రత్నము వేసిన బాట

ఎందరో ఉజ్జ్వల భవిష్యత్తుకు

రాచబాటయై రత్న ఖచిత ఆభరణంలా

భారతమాతకు కంఠహారమై

 జిలుగు వెలుగులను విరజిమ్ముతూనేఉంది

ఆ కీర్తి ఎందరికో స్ఫూర్తినిస్తూనే ఉంది

పీవీ శత జయంతి ఉత్సవాలకి

ఇదే నా కవితా సుమాంజలి

మంజుల సూర్య, హైదరాబాద్

Related posts

దళిత బందుతో దళితులు వ్యాపారస్థులుగా ఎదిగేలా అవగాహన

Satyam NEWS

కోటప్పకొండ వచ్చే భక్తులు పాటించాల్సిన ట్రాఫిక్ నిబంధనలు

Bhavani

పువ్వాడ,పొంగులేటి ల మధ్య మాటలయుద్దం

Bhavani

Leave a Comment