42.2 C
Hyderabad
April 26, 2024 16: 52 PM
Slider నల్గొండ

ఇబ్రహీంపట్నం సబ్ స్టేషన్ ముట్టడించిన కోమటిరెడ్డి

#Komatireddy Venkatreddy

పెరిగిన కరెంట్ ధరలను తగ్గించాలంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న నిరసనలో భాగంగా ఇబ్రహీంపట్నం లో కరెంట్ సబ్ స్టేషన్ వద్ద భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఇబ్రహీంపట్నం ఏడి కి మెమోరాండం ఇచ్చారు. పెరిగిన కరెంట్ ధరలను తగ్గించాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

లాక్ డౌన్ పెట్టింది ప్రభుత్వమే. లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలను ఆదుకోవాల్సిన సమయంలో ఇలా ధరలు పెంచడం ఏంటి..? అని ఆయన ప్రశ్నించారు. లాక్ డౌన్ సమయంలో బిల్లులు కట్టకుండా ఉన్న ప్రజలపై ఇప్పుడు ఒకేసారి ప్రజలపై భారం మోపడం న్యాయం కాదని ఆయన అన్నారు.

స్లాబుల పేరుతో అధిక కరెంట్ బిల్లు లను ప్రజలపై మోపి కేసీఆర్ ఖజానా నింపుకోవాలని చూస్తున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ప్రగతి భవన్ లో కరోనా వచ్చిందని కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లాడని ఆయన అన్నారు. కేసీఆర్ నియంత పాలనలో తెలంగాణ ప్రజలు విసిగిపోతున్నారని ఆయన అన్నారు. కరోనా ని ఆరోగ్య శ్రీ లో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.

Related posts

వ‌చ్చే ఉగాది నాటికి కొత్త జిల్లాలోకి పోలీస్ వ్య‌వ‌స్థ అంతా…!

Satyam NEWS

సిపిఎస్ అంతం TEA పంతం

Satyam NEWS

వచ్చే నెల 8వ తేదీన బి.సి. లిటరరీ ఫెస్టివల్-2019

Satyam NEWS

Leave a Comment