38.2 C
Hyderabad
April 29, 2024 20: 42 PM
Slider కవి ప్రపంచం

కార్మిక శక్తి

#KolipakaSrinivas

మట్టి మనిషి
స్వేదం చిందించనిదే
విత్తు విచ్చుకొని మొలకెత్తదు

ఆ కార్మికుడు
తనువు యంత్రాన్ని తిప్పందే
విశ్వపు ప్రగతి రథచక్రాలు
పరుగుపరుగున
పరుగులు తీయదు

ఆ శ్రమజీవి పునాదులపై
ఇటుకలు పేర్చనిదే
సంసారపు జీవనగూడు దొరకదు

నింగికీ నేలకూ మధ్య
వారధిగా కాంతి పుంజమై
కార్మికశక్తి లేకపోతే
సమాజ ఆశయాలపై
వెలుగురేఖలు ప్రసరించవు

ఆ కార్మికుని శక్తి
మబ్బులో మేఘమై కరగనిదే
మన గొంతుకల దాహార్తి తీరదు

అతడొక
దిక్కులెరుగని కర్షకుడు
విరామమెరుగని శ్రామికుడు
అలుపెరుగని కార్మికుడు
అన్ని వసంతాలకు..అన్ని కాలాలకు..
సమస్త లోకానికి ఆరాధ్యుడు

కార్మికుల శక్తి ముందు
సమస్తము బలాదూర్
నింగిపై నిలిచిన ధైర్యం అతడు
ప్రజా ప్రయోజనం కోసం
కొత్త నడవడికి ఊపిరి పోసే
దయాసముద్రుడు కార్మికుడు

కార్మికుడి శక్తినంతా
ఇంధనమై నింపితేనే
యంత్రాలు కాలంతో పరుగులు పెట్టేది
హాలికుడి తనువును ధారపోస్తేతేనే
అభివృద్ధి ప్రగతి అందలమెక్కేది

స్వశక్తి పోకడలకు నిదర్శనమై
కృషితో ఓడి గెలిచేది కార్మిక శక్తే
యుగ యుగానికి వెలుగుల
హేతువైన సూర్యుడు…!
సమాజాన్ని చక్కదిద్దే శ్రమ యోధులు..
భవ్యభారతావని మేలు కోరే క్రాంతదర్శులు..!

కొలిపాక శ్రీనివాస్ 9866514972

Related posts

ఎంతో ఘనంగా మహాత్మాగాంధీ జయంతి వేడుకలు

Satyam NEWS

కేసీఆర్ సారు ఆరోగ్యం ఎలా ఉందో చెప్పాలి

Satyam NEWS

పెండింగ్ పనులపై సీఎంను కలిసిన ఒంగోలు ఎంపి

Satyam NEWS

Leave a Comment