38.2 C
Hyderabad
April 29, 2024 21: 24 PM
Slider కవి ప్రపంచం

మారిన రాగం

#Redium New

చీకటి గుహలో

నిర్మానుష్య నీలి పర్వత శ్రేణుల్లో

పొడి పొడి గా మసులుతున్నావు

అగ్నిపర్వత శిఖర బిలంపైనుండి

ఎర్రెర్రని జ్వాల కవోష్ణలావా గా

పరుగెత్తుకుంటు రావాలని

ఎంత గానోతపిస్తున్నావు

ఎన్నో ఏండ్లుగా

నీకై వేచిన నేల పునీతం కావాలని

వాడివడి తగ్గిన తనువుకు

వేడితగిలి వడిపెరిగి

తకిట తకిట తకిటతా అంటూ

లయాన్వితంగా

భయాన్వితంగా

దారి పొడుగున

శార్ధూల మత్యేభాల

గర్జనలు వింటూ…

ప్రకృతి రమణీయమణికి

పచ్చల హారాలు

నీ ఆహ్వానం కోసం

చంపకాలు ఉత్పలమాలికలు

సిద్ధంగా ఉన్నాయి

నీవు సరళమైన ప్రజాభిష్టానికి

జనపదమై ఆనందపదమై

విలయతాండవ లయ కాస్తా

కిలకిల రావంగా

ప్రత్యూష స్పర్శలా

సుగమన రాగమై

ప్రియజన భావమై

నిత్యనూతన మయ్యావు

రంగురంగుల కలలో నిద్రపుచ్చక

మేలుకొల్పు ప్రభాత గీతమై

రా ఇదే మా ఆహ్వానం

రేడియమ్, ఫోన్ నెం: 9291527757

Related posts

పివి రావు మాల మహానాడు కొవ్వొత్తుల ర్యాలీ

Satyam NEWS

వ్యాక్సినేషన్ 100 కోట్లు పూర్తయిన సందర్భంగా మోడి చిత్రపటానికి పాలాభిషేకం

Satyam NEWS

కరోనా ఎఫెక్ట్: దేశంలో ప్రింట్ మీడియా షట్ డౌన్ తప్పదా?

Satyam NEWS

Leave a Comment