33.7 C
Hyderabad
April 29, 2024 02: 16 AM
Slider కవి ప్రపంచం

విత్తు కాంక్ష

#sandhyasutravy new

తనను పదిల పరచు మని

నాటమని నీరు పోయు మని

జాగ్రత్తగా చూడమని

చెప్తుంది విత్తు

అంతే చిన్న బుడిపెగా

మట్టి నుండి పైకొచ్చి

కొంచెం కొంచెం 

చిన్ని చిన్ని ఆశల ఆకులతో

ఎదిగి మొక్కగా ఒదిగి

మాను దన్నుగా ఏపుగా

పెరిగి చెట్టు అవుతుంది

కాసుల వర్షం కురిపిస్తుంది  

ఆకులు పువ్వులు

కాయలు పండ్లు      

నీడ గాలి గూడు    

వేర్లు ఇలా ఎన్నో

లాభాల నిస్తుంది

నిస్వార్థ సేవా తత్పరతతో

సంతోషంగా ఇస్తుంది పండ్లు

తాను మోడైన

తర్వాత కూడా కట్టెగా

ఇంధనమై మండుతుంది

వంట చెరకు అవుతుంది

ధరణిపై ముప్పైశాతం

తప్పనిసరి  చెట్లు ఉంటే

విషపూరిత వాయువులకు

ఉండదు నెలవు 

వాతావరణం అవుతుంది స్వచ్ఛం

అందరూ ఉంటారు

ఆరోగ్యంగా ఆహ్లాదంగా

స్వేచ్ఛ వాయువులు

పీల్చుతూ ప్రియ ప్రకృతిలో

అందుకే మనిషికో మొక్క

నాటాలి పక్కా

కల్పించాలి దానికి రక్షణ

అందుకు విద్యార్థులకు

ఇవ్వాలి శిక్షణ

అప్పుడే  అవుతుంది

కార్బన వాయువుల ప్రక్షాళన

తీయని అనుభూతితో

కూడిన భుక్తి కి మనం

పాటించాలి ఈ యుక్తి

ఇది విత్తు అజరామర కాంక్ష

సంధ్య సుత్రావె, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, హైద్రాబాద్, ఫోన్: 9177615967.

Related posts

హురియత్ కాన్ఫరెన్స్ నుంచి వైదొలగిన జిలానీ

Satyam NEWS

‘ఊరు ఊరుకి జమ్మి చెట్టు’ గొప్ప కార్యక్రమం

Satyam NEWS

గుంటూరు జిల్లాలో ద్విచక్ర వాహనాల దొంగలు అరెస్టు

Satyam NEWS

Leave a Comment