33.7 C
Hyderabad
April 29, 2024 00: 31 AM
Slider కవి ప్రపంచం

అభివృద్ధి భారత్

#arunachamarthi

ఎదిగింది ఎదిగింది భారతం

ఆధునిక సాంకేతికత పెంచుకుంటూ నిరతం

మన పూర్వీకులు విజ్ఞాన నిధులు

ఆచరణగ చెప్పారు అనేక విధులు

కోల్పోయాం దాడులలో సంపద

ఉంటే తీరు ఎన్నో రోగాల వ్యధ

అమూల్యం మన వేద జ్ఞానం

పోయిన నిలదొక్కుకున్నాం

సఫలం రోదసికి పంపిన రాకెట్

పెంచుకున్న మన వీటో వికెట్

యువత నడుస్తోంది చెడు మార్గాన

పరాయి దేశ పధాన

దేశం మారుతుందిక వృద్ధ నిలయం

కొత్త కొత్త సమస్యలతో పెరిగే విలయం

భాషేదైనా మతమేదైనా అంతా ఒక తల్లి బిడ్డలం

కలిసికట్టుగా సాధిద్దాం తిప్పి కొట్టి కుట్ర దారుల జాలం

అరుణ చామర్తి ముటుకూరి, మెదక్, 9000683826

Related posts

సాయంత్రం ఏడు గంటలకే తుది జాబితా

Satyam NEWS

81 అతి సమస్యాత్మక పోలీంగ్ స్టేషన్ లలో పోలింగ్.. బీ అలెర్ట్

Satyam NEWS

సూపర్ మైల్ట్‌’ వేరియంట్‌గా ఒమిక్రాన్.. టార్గెట్‌గా యువత

Sub Editor

Leave a Comment